కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 92

the goat 13 days collections
బాక్సాఫీస్

400 కోట్లు దాటిన ది గోట్ కలెక్షన్స్

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.రెండవ వారం లోకూడా ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడం తో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిర్మాతల లెక్కల ప్రకారం ది గోట్ 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 413కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.విజయ్ ఈ ఫీట్ సాధించడం ఇది రెండోసారి.ఇంతకుముందు లియో తో మొదటి సారి 400కోట్ల మార్క్ దాటాడు.ది గోట్ ముఖ్యంగా తమిళనాడు అలాగే ఓవర్సీస్ లో అదరగొడుతుంది.యావరేజ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లంటే చిన్న విషయం కాదు.తమిళనాడు లో ఆల్రెడీ 200కోట్ల మార్క్ ను దాటింది.ఫుల్ రన్ లో అక్కడ లియో లైఫ్ టైం కలెక్షన్స్ ను బీట్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు…

Mahender Reddyవాట్సాప్
Kanguva New Release Date out
రిలీజ్ అప్‌డేట్

కంగువా రిలీజ్ డేట్ మారింది

మచ్ అవైటెడ్ సూర్య కంగువా రిలీజ్ డేట్ మారింది.అక్టోబర్ 10న ఈసినిమాను రిలీజ్ చేయనున్నామని ఇంతకుముందు ప్రకటించారు.అయితే కొన్ని రోజుల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయన్ కూడా అదే రోజున వస్తున్నామని అనౌన్స్ చేశారు.దాంతో కంగువా భారీ బడ్జెట్ సినిమా కావడంతో పోటీ లో వస్తే నష్టం తప్పదనుకొని వెనక్కి వెళ్ళింది.ఇక కొత్త రిలీజ్ డేట్ ప్రకారం కంగువా నవంబర్ 14న అన్ని భాషల్లో విడుదలకానుంది.ఇప్పటివరకు అయితే ఆ డేట్ మరో సినిమా అయితే రావడం లేదు.సో కంగువాకు సోలో రిలీజ్ దొరికినట్లే.

Mahender Reddyవాట్సాప్
Charming Star Sharwanand 38th Movie Announcement
సినిమా వార్తలు

శర్వా38 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

చార్మింగ్ స్టార్ శర్వానంద్ విభిన్న శ్రేణి స్క్రిప్ట్‌లను ఎంచుకుని విలక్షణమైన మార్గంలో నడుస్తున్నాడు. ఇటీవలే 'మనమే' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన తాజాగా కొత్త సినిమాను ప్రారంభించాడు. తన ట్రేడ్‌మార్క్ శైలిలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుగాంచిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నంది దీనికి దర్శకత్వం వహించనున్నాడు. #Sharwa38గా వ్యవహరించబడుతున్న ఈ మూవీ వీరి కాంబోలో వస్తోన్న మొదటిచిత్రం కావడం గమనార్హం.

Srikanth Mవాట్సాప్
Director Mallidi Vassishta Announced The Release Date of Vishwambhara
రిలీజ్ అప్‌డేట్

అఫీషియల్.. విశ్వంభర రిలీజ్ డేట్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ 'విశ్వంభర'. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. కునాల్ కపూర్, సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Srikanth Mవాట్సాప్
Music Director SS Thaman Gives Interesting Updates About Game Changer
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్.. ఇంట్రెస్టింగ్ అప్‍డేట్స్ ఇచ్చిన థమన్

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
NaniOdela 2 Mass Madness Begins
సినిమా వార్తలు

నాని-శ్రీకాంత్ ఓదెల మాస్ మ్యాడ్‌నెస్ షురూ

నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. ఇటీవలే 'సరిపోదా శనివారం' సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన రీసెంట్‌గా తన ఓన్ ప్రొడక్షన్‌లో బ్లాక్ బస్టర్ 'హిట్' ఫ్రాంచైజీ 'హిట్ పార్ట్ 3'ని ప్రారంభించాడు. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ కాంబోలో కొత్త సినిమాను పట్టాలెక్కించేసాడు.

Srikanth Mవాట్సాప్
Fahadh Faasil Acts as Patrick in Rajinikanth's Vettaiyan
సినిమా వార్తలు

వేట్టైయాన్‌లో ఫహద్ ఫాసిల్ పాత్ర ఇదే..!

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్‌'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేసింది. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
National Cinema Day 2024 Movie Tickets Price to be Just Rs.99 on September 20
సినిమా వార్తలు

నేషనల్ సినిమా డే.. మూవీ లవర్స్‌కి బంపర్ ఆఫర్

మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమాలు వీక్షించాలని ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే ఆ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే మాత్రం భారీగానే ఖర్చు పెట్టాల్సి వుంటుంది. సాధారణంగా ఒక ఫ్యామిలీ అంతా కలిసి మల్టీప్లెక్స్‌లో ఏదయినా మూవీ చూడాలంటే తక్కువలో తక్కువ రూ.1,000కి పైగానే అవుతుంది. దీంతో చాలామంది సినిమాలపై అభిమానమున్నా అక్కడ చూసేందుకు వెనుకడుగు వేస్తుంటారు.

Srikanth Mవాట్సాప్
Action Prince Dhruva Sarja's Martin Nizam Rights Acquired by Mythri Distributors
సినిమా వార్తలు

ప్రముఖ సంస్థ చేతికి ధృవ సర్జా 'మార్టిన్' నైజాం రైట్స్

ప్రముఖ కన్నడ యంగ్ హీరో, యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా టైటిల్ పాత్ర‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మార్టిన్'. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ఉద‌య్ కె.మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ‘అదంతేలే..’ అంటూ సాగే ఓ ల‌వ్ మెలోడీ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Ritesh Rana talks about Mathu vadalara 2
ఇంటర్వ్యూ

మత్తువదలరా 2 కు ఈ రేంజ్ రెస్పాన్స్ ఊహించలేదు- డైరెక్టర్ రితేష్ రానా

శ్రీ సింహ ,సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మత్తువదలరా2 బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి హిట్ అనిపించుకున్న ఈసినిమా బ్లాక్ బాస్టర్ వైపు పరుగులు పెడుతుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ రానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
upendra poster out from Ui The Movie
ఫస్ట్ లుక్

ఉపేంద్ర యూఐ నుండి పోస్టర్ రిలీజ్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న సినిమా యూఐ.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈరోజు ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో ఉపేంద్ర హార్స్ పై కూర్చొని ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు.ఉపేంద్ర కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.అక్టోబర్ లో థియేటర్లలోకి తీసుకురానున్నారు.

Mahender Reddyవాట్సాప్
Devara Creates New Records in Pre Sales at Australia
సినిమా వార్తలు

ప్రీ సేల్స్‌లో దూసుకుపోతోన్న దేవర

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. దేవర నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక రీసెంట్‌గా ముంబైలో ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Stree2 Becomes the HIGHEST GROSSING HINDI FILM EVER
సినిమా వార్తలు

ఇండస్ట్రీ హిట్ కొట్టిన స్త్రీ 2

బాలీవుడ్ మూవీ స్ట్రీ 2 ఇండస్ట్రీ హిట్ రికార్డు కొట్టేసింది.గత నెలలో విడుదలైన ఈసినిమా ఇప్పటికీ సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో అత్యధిక వసూళ్లను సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది.నిన్నటి తో స్త్రీ 2, 586 కోట్ల వసూళ్లను సాధించింది.ఇంతకుముందు షారుఖ్ ఖాన్, జవాన్ 584కోట్ల నెట్ తో మొదటి స్థానం లో ఉండేది. ఇప్పుడు స్త్రీ 2 ఆ రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానం లో నిలిచింది. ఈ స్త్రీ 2 రికార్డు ను బ్రేక్ చేసే అవకాశం నెక్స్ట్ పుష్ప 2కే వుంది.ఫస్ట్ పార్ట్ అక్కడ 100కోట్లకు పైగా రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.పుష్ప 2 కు తెలుగులో ఎంత హైప్ వుందో నార్త్ లోనూ…

Mahender Reddyవాట్సాప్
Jr NTR respond on doing a straight Tamil film
సినిమా వార్తలు

ఆ డైరెక్టర్ తో సినిమా చేయాలని వుంది -ఎన్టీఆర్

మచ్ అవైటెడ్ దేవర వచ్చే వారంలో థియేటర్లోకి రానుంది.ఎన్టీఆర్ నుండి 6ఏళ్ల తరువాత సోలో గా వస్తున్న సినిమాకావడంతో దేవరపై భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం దేవర టీం ప్రమోషన్స్ తో బిజీగా వుంది.పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు.అందులో భాగంగా నిన్న చెన్నై లో ప్రెస్ మీట్ లో పాల్గొంది దేవర టీమ్.

Mahender Reddyవాట్సాప్
Mathu Vadalara2 heading Towards BlockBuster
సినిమా వార్తలు

బ్లాక్ బాస్టర్ దిశగా మత్తువదలరా 2

శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫరియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటించిన మత్తు వదలరా 2 గత వారంలో విడుదలై సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా బాగుండడంతో నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల వరకు వసూళ్లను సాధించింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ లోకి వచ్చింది.దేవర వచ్చే వరకు అడ్డులేకపోవడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.

Mahender Reddyవాట్సాప్
Actress Ananya Nagalla Handed Over Cheque of Rs.2.5 Lakhs To AP CM Chandrababu Naidu
సినిమా వార్తలు

సీఎం చంద్రబాబును కలిసిన అనన్య నాగళ్ల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలు, దరిమిలా వచ్చిన భారీ వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ వరదల వల్ల భారీ ఆస్తి మరియు ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ తరపున పలువురు ప్రముఖులు వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. దీనిలో భాగంగా తమ బాధ్యతగా భారీ విరాళాలను ప్రకటించి మంచి మనస్సు చాటుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Devara Fourth Single Ayudha Pooja Update
సాంగ్

దేవర.. 'ఆయుధ పూజ' సాంగ్ వచ్చేస్తోంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రంలో తారక్ డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా విడుదలకు ముందే అనేక సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Matka Final Schedule Action Sequence Making Video Released
షూటింగ్ అప్‌డేట్

మట్కా నుండి యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మట్కా'. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Oo Pillo Lyrical Video Out From Vishwak Sen's Mechanic Rocky
సాంగ్

మెకానిక్ రాకీ నుండి ఓ పిల్లో లిరికల్ వీడియో రిలీజ్

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్‌కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ చిత్రంలో 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ కూడా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
MAD Square Team Released First Look Poster and Announced First Single Update
ఫస్ట్ లుక్

మ్యాడ్ స్క్వేర్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్' చిత్రం గతేడాది అక్టోబరులో విడుదలై ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి సీక్వెల్‍గా 'మ్యాడ్ స్క్వేర్‌' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ యేడాది ఉగాది శుభ సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించిన విషయం గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్

షేర్