తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.రెండవ వారం లోకూడా ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడం తో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిర్మాతల లెక్కల ప్రకారం ది గోట్ 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 413కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.విజయ్ ఈ ఫీట్ సాధించడం ఇది రెండోసారి.ఇంతకుముందు లియో తో మొదటి సారి 400కోట్ల మార్క్ దాటాడు.ది గోట్ ముఖ్యంగా తమిళనాడు అలాగే ఓవర్సీస్ లో అదరగొడుతుంది.యావరేజ్ టాక్ తో ఈ రేంజ్ వసూళ్లంటే చిన్న విషయం కాదు.తమిళనాడు లో ఆల్రెడీ 200కోట్ల మార్క్ ను దాటింది.ఫుల్ రన్ లో అక్కడ లియో లైఫ్ టైం కలెక్షన్స్ ను బీట్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఓవర్సీస్ లో 100కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది.వెంకట్ ప్రభు ఈసినిమాను డైరెక్ట్ చేయగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.ఇందులో స్నేహ,మీనాక్షి చౌదరి,ప్రశాంత్,ప్రభుదేవా,అజ్మల్,లైలా,మీనాక్షి చౌదరీ,యోగిబాబు,వీటీవీ గణేష్,జయరామ్ కీలక పాత్రలు పోషించారు.ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మించింది.
ఇక విజయ్ ప్రస్తుతం తన 69 సినిమా కోసం రెడీ అవుతున్నాడు.వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది.హెచ్ వినోత్ ఈసినిమాను తెరకెక్కించనుండగా అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.భారీ బడ్జెట్ తో కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించనుంది.వచ్చే ఏడాది అక్టోబర్ లో థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: