మచ్ అవైటెడ్ సూర్య కంగువా రిలీజ్ డేట్ మారింది.అక్టోబర్ 10న ఈసినిమాను రిలీజ్ చేయనున్నామని ఇంతకుముందు ప్రకటించారు.అయితే కొన్ని రోజుల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయన్ కూడా అదే రోజున వస్తున్నామని అనౌన్స్ చేశారు.దాంతో కంగువా భారీ బడ్జెట్ సినిమా కావడంతో పోటీ లో వస్తే నష్టం తప్పదనుకొని వెనక్కి వెళ్ళింది.ఇక కొత్త రిలీజ్ డేట్ ప్రకారం కంగువా నవంబర్ 14న అన్ని భాషల్లో విడుదలకానుంది.ఇప్పటివరకు అయితే ఆ డేట్ మరో సినిమా అయితే రావడం లేదు.సో కంగువాకు సోలో రిలీజ్ దొరికినట్లే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో శివ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా దిశా పటాని ,బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.స్టూడియో గ్రీన్ తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఇక చాలా గ్యాప్ తరువాత సూర్య నుండి వస్తున్న సినిమా కావడంతో కంగువా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలావుంటే సూర్య ప్రస్తుతం తన 44 వ సినిమాలో నటిస్తున్నాడు.పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.పెద్దగా బ్రేకులు ఏమి లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ప్రస్తుతం చెన్నై లో ఓ షెడ్యూల్ జరుగుతుంది.ఈసినిమాలో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: