బ్లాక్ బాస్టర్ దిశగా మత్తువదలరా 2

Mathu Vadalara2 heading Towards BlockBuster

శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫరియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటించిన మత్తు వదలరా 2 గత వారంలో విడుదలై సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా బాగుండడంతో నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల వరకు వసూళ్లను సాధించింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ లోకి వచ్చింది.దేవర వచ్చే వరకు అడ్డులేకపోవడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అటు ఓవర్సీస్ లో ఈసినిమా నిన్నటితో 800k మార్క్ ను క్రాస్ చేసింది.ఈవారంలో మిలియన్ మార్క్ ను చేరుకోనుంది.కేవలం అక్కడ 2కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో ఈసినిమా బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో మత్తువదలరా 2 బ్లాక్ బాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది.గత నెలలో చిన్న సినిమాలుగా వచ్చి కమిటీ కుర్రోళ్ళు ,ఆయ్ బ్లాక్ బాస్టర్స్ అవ్వగా ఈనెలలో మత్తువదలరా 2 అదే ఫలితాన్ని రిపీట్ చేసింది.

మత్తువదలరా కు సీక్వెల్ గా రితేష్ రానా తెరకెక్కించిన ఈసినిమాలో సత్య కామెడీ హైలైట్ గా నిలిచింది.ఇందులో సునీల్,వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించగా కాల భైరవ సంగీతం అందించాడు.క్లాప్ ఎంటర్టైన్మెంట్,మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాయి.ఇక మత్తువదలరా 2 కూడా విజయం సాధించడంతో నెక్స్ట్ పార్ట్ మత్తువదలరా 3 కూడా రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.