మచ్ అవైటెడ్ దేవర వచ్చే వారంలో థియేటర్లోకి రానుంది.ఎన్టీఆర్ నుండి 6ఏళ్ల తరువాత సోలో గా వస్తున్న సినిమాకావడంతో దేవరపై భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ప్రస్తుతం దేవర టీం ప్రమోషన్స్ తో బిజీగా వుంది.పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు.అందులో భాగంగా నిన్న చెన్నై లో ప్రెస్ మీట్ లో పాల్గొంది దేవర టీమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈమీట్ లో స్ట్రయిట్ తమిళ్ సినిమా ఎప్పుడు చేస్తారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానమిచ్చాడు.వెట్రి మారన్ సర్ నా ఫేవరేట్ డైరెక్టర్.సర్ నాతో ఒక సినిమా చేయండి.స్ట్రయిట్ తమిళ సినిమా చేసి తెలుగు లోకి డబ్ చేద్దాం అని ఎన్టీఆర్ అన్నాడు.వెట్రిమారన్ రా & రస్టిక్ సినిమాలు తీయడంలో దిట్ట.అలాంటి డైరెక్టర్ కు మాస్ హీరో ఎన్టీఆర్ దొరికితే మాస్ ప్రేక్షకులకు పండగే.మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
ఇక దేవర నుండి నాలుగో పాట రేపు విడుదలకానుంది.ఇప్పటివరకు వచ్చిన మూడు పాటలు అంచనాలను అందుకున్నాయి.ఈ చివరి పాట అంతకు మించి వుండనుందట.కొరటాల శివ ఈసినిమాను డైరెక్ట్ చేయగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.అనిరుధ్ సంగీతం అందించాడు.ఈనెల 27న దేవర ఫస్ట్ పార్ట్ విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: