శర్వా38 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

Charming Star Sharwanand 38th Movie Announcement

చార్మింగ్ స్టార్ శర్వానంద్ విభిన్న శ్రేణి స్క్రిప్ట్‌లను ఎంచుకుని విలక్షణమైన మార్గంలో నడుస్తున్నాడు. ఇటీవలే ‘మనమే’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన తాజాగా కొత్త సినిమాను ప్రారంభించాడు. తన ట్రేడ్‌మార్క్ శైలిలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుగాంచిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నంది దీనికి దర్శకత్వం వహించనున్నాడు. #Sharwa38గా వ్యవహరించబడుతున్న ఈ మూవీ వీరి కాంబోలో వస్తోన్న మొదటిచిత్రం కావడం గమనార్హం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఇందుకు సంబంధించి అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌ గమనిస్తే.. వ్యర్థ భూమిలో మంటలు చెలరేగుతున్నట్లు కనిపిస్తుంది. కొంతకాలంగా ఈ కథపై కసరత్తు చేస్తున్న సంపత్ నంది, శర్వాను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయనున్నాడు. ఇక 1960ల నాటి పాత్రను పోషించేందుకు శర్వానంద్ కూడా స్పెషల్ మేకోవర్‌ అవుతున్నాడు.

1960ల చివరలో, భారతీయ సెల్యులాయిడ్‌లో చాలా అరుదుగా అన్వేషించబడిన ఉత్తర తెలంగాణ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామీణ నేపథ్యంలో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. అనేక సమస్యలకు రక్తం సమాధానంగా మారే భయంతో కూడిన ప్రపంచంలో కథ ఉండనుంది.

కాగా #Sharwa38 గ్రిప్పింగ్ యాక్షన్ మరియు ఎమోషనల్ చార్జ్డ్ సీక్వెన్స్‌లతో రా అండ్ రస్టిక్‌గా ఉండబోతోంది. వెండితెరపై ఇంతకు ముందెన్నడూ చెప్పని మరియు చర్చించని అంశాలతో తెరకెక్కుతోంది. ఈ సబ్జెక్ట్ యొక్క యూనివర్సల్ అప్పీల్ దృష్ట్యా, వారు దీనిని పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నారు.

ఈ చిత్రానికి సౌందర్ రాజన్ ఎస్ కెమెరా క్రాంక్ చేయగా, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి పని చేసే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో, సాంకేతిక ప్రమాణాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కెకె రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా #Sharwa38 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.