ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలు, దరిమిలా వచ్చిన భారీ వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ వరదల వల్ల భారీ ఆస్తి మరియు ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ తరపున పలువురు ప్రముఖులు వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. దీనిలో భాగంగా తమ బాధ్యతగా భారీ విరాళాలను ప్రకటించి మంచి మనస్సు చాటుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో నటి అనన్య నాగళ్ల ఏపీలోని వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. వారి సహాయార్ధం తన వంతు సాయంగా 2.5 లక్షల రూపాయలను అందించారు. ఈ మేరకు తాజాగా ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకుని ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నటి అనన్య నాగళ్లను అభినందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: