మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. కునాల్ కపూర్, సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రం నుంచి టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగాస్టార్ కెరీర్‌లోనే ఇంతకుముందెన్నడూ లేనివిధంగా భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న విశ్వంభర తాజాగా క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ ఇంటెన్స్ క్లైమాక్స్‌కి ఇండియన్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు యాక్షన్ డిజైన్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సహా ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుపుకుంటున్న ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతోంది.
వశిష్ట క్రియేటివ్ అప్రోచ్‌తో ఫాంటసీ ఎలిమెంట్స్‌ని విజువల్‌గా మహాద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. విశ్వంభర మూవీ వచ్చే యేడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు చిత్ర దర్శకుడు మల్లిడి వశిష్ట సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశ్వంభర లో ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.
భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కోసం పేరొందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, శ్రీ శివశక్తి దత్తా లిరిక్ రైటర్స్ కాగా.. శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా ఉన్నారు. కాగా విశ్వంభర 2025లో జనవరి 10 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: