
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 27


కూలీలో పూజా హెగ్డే

సరికొత్త రికార్డు సృష్టించిన లక్కీ భాస్కర్

మాస్ జాతర షూటింగ్ అప్డేట్

తెలుగులో రిలీజ్ కానున్న ఛావా

ది ప్యారడైజ్ గ్లింప్స్.. బోల్డ్ అండ్ వైల్డ్‌గా

కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

దిల్ రుబా థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

గుడ్ బ్యాడ్ అగ్లీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

శివరాత్రికి థియేటర్లలో ఎన్టీఆర్ సినిమాలు

సామజవరగమన మిస్ చేసుకున్నా - సందీప్ కిషన్

దేవర ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్

టాలీవుడ్లో విషాదం.. ప్రొడ్యూసర్ మృతి

హిట్ 3 టీజర్ కు రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్

ఫంకీ హీరోయిన్ రేసులో కయాదు లోహర్

మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్

8 వసంతాలు నుండి త్వరలో ఫస్ట్ సింగిల్

ది ప్యారడైజ్ స్పెషల్ వీడియో రానుంది

కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. కుబేర చిత్రం ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు.

కూలీలో పూజా హెగ్డే
సూపర్ స్టార్ రజినీకాంత్ ,సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు.ఇక ఈసినిమా నుండి లేటెస్ట్ గా ఓ అప్డేట్ వచ్చింది.ఈసినిమా కోసం పూజా హెగ్డే ను తీసుకున్నారు.ఈ సందర్భంగా పూజా హెగ్డే ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.రేపు ఉదయం 11 గంటలకు పూజా పూర్తి లుక్ ను రివీల్ చేయనున్నారు.అయితే ఇందులో తను స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని సమాచారం.

సరికొత్త రికార్డు సృష్టించిన లక్కీ భాస్కర్
గత ఏడాది దీపావళికి వచ్చి ఊహించని విజయాన్ని సాధించింది లక్కీ భాస్కర్.ఫుల్ రన్ లో 120కోట్లకుపైగా వసూళ్లను సాధించి సెన్సేషన్ సృష్టించింది. ఈసినిమా తో దుల్కర్ సల్మాన్ కెరీర్ లో మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.ఒక్క తెలుగులోనే కాదు తమిళ, మలయాళంలోనూ ఈసినిమా సూపర్ రన్ ను కొనసాగించింది. ఇక థియేట్రికల్ రిలీజ్ తరువాత ఓటిటిలోకి వచ్చి అక్కడ కూడా సెన్సేషనల్ వ్యూస్ తో దూసుకుపోతుంది.ఈ క్రమంలో ఏ సౌత్ ఇండియన్ మూవీ సాధించని అరుదైన రికార్డు సాధించింది.

మాస్ జాతర షూటింగ్ అప్డేట్
గత ఏడాది రెండు సినిమాలతో వచ్చిన మాస్ రాజా రవితేజకు ఆ సినిమాలు విజయాన్ని అందించలేకపోయాయి.ఇక తను నెక్స్ట్ మాస్ జాతర తో రానున్నాడు.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్.రవితేజకు ఇది 75వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ విషయానికి వస్తే రీసెంట్ గా అరకు షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఈనెల 28న నుండి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది.

తెలుగులో రిలీజ్ కానున్న ఛావా
విక్కీ కౌశల్ ఛావా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.రెండో వారంలోనూ ఈసినిమా సెన్సేషనల్ హోల్డ్ తో డామినేషన్ కొనసాగిస్తుంది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా 19.23 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.ఈరోజు శివరాత్రి సందర్భంగా హాలిడే కావడంతో ఈరోజు వసూళ్లు పెరగనున్నాయి.12 రోజుల్లో ఈసినిమా దేశవ్యాప్తంగా 372.84 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.రేపటి తో 400కోట్ల క్లబ్ లో చేరనుంది.

ది ప్యారడైజ్ గ్లింప్స్.. బోల్డ్ అండ్ వైల్డ్‌గా
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి కొలాబరేట్ అయ్యారు. ‘ది ప్యారడైజ్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దసరాకు మించిన యాక్షన్‌తో దీనిని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.

కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
హీరో విష్ణు మంచు టైటిల్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

రీరిలీజ్ అవుతోన్న బాలయ్య ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్
టాలీవుడ్లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ క్రేజీ మూవీ చేరింది.

దిల్ రుబా థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా క తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.అంతేకాదు ఈసినిమాతో 50కోట్ల క్లబ్ లో చేరాడు.ఇక ఈ సినిమా తరువాత కిరణ్ ,దిల్ రుబా తో రానున్నాడు.లవ్ &యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో కిరణ్ సరసన రుక్షార్ దిల్లాన్ నటించగా మరో నటి నజియా డేవిసన్ కీలక పాత్రలో కనిపించనుంది. క కన్నా ముందే ఈసినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

గుడ్ బ్యాడ్ అగ్లీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సహా ఇతర ప్రచారచిత్రాలకుట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

శివరాత్రికి థియేటర్లలో ఎన్టీఆర్ సినిమాలు
మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి పండుగ రాబోతోంది. ఆరోజున తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు పూజలు, పునస్కారాలలో నిమగ్నమై ఉంటారు. అలాగే ఉపవాసం మరియు జాగరణ వంటి నియమాలతో ఆ పరమ శివుడిని తలచుకుంటూ రోజంతా నిష్టగా గడుపుతారు. అయితే మరోవైపు సినీ ప్రియులు మాత్రం కొత్త సినిమాలు లేదా స్టార్ హీరోల సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

సామజవరగమన మిస్ చేసుకున్నా - సందీప్ కిషన్
శ్రీ విష్ణు హీరోగా రెండేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది సామజవరగమన.ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా దాదాపు 30 కోట్ల వసూళ్లను సాధించింది.అయితే ఈసినిమాను చేసే ఛాన్స్ ముందుగా యంగ్ హీరో సందీప్ కిషన్ కు వచ్చింది.కానీ అదే టైం లో మైఖేల్ అనే సినిమా చేస్తుండడంతో ఈసినిమాను వదులుకోవాల్సి వచ్చిందని సందీప్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.అయితే మైఖేల్ నిరాశపరిచింది.అదే సామజవరాగమన చేసి ఉంటే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టేవాడు.

దేవర ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్
గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది దేవర ఫస్ట్ పార్ట్.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశాడు.థియేట్రికల్ రిలీజ్ తరువాత ఓటిటి లోకి రాగ అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా జపాన్ లో విడుదలకానుంది. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కి జపాన్ లో ఫాలోయింగ్ వచ్చింది.దాంతో దేవరను జపనీస్ లో విడుదలచేయనున్నారు.

టాలీవుడ్లో విషాదం.. ప్రొడ్యూసర్ మృతి
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నిర్మాత కేదార్ కన్నుమూశారు. దుబాయ్ లో ఆయన కన్నుమూసినట్టు సమాచారం. అయితే కేదార్ మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.విజయ్ దేవరకొండ సోదరుడు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండతో ఆయన 'గంగం గణేశా' అనే సినిమాను నిర్మించారు.

హిట్ 3 టీజర్ కు రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్
హ్యాట్రిక్ విజయాల తరువాత నేచురల్ స్టార్ నాని నెక్స్ట్ హిట్ 3తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.హిట్ ఫ్రాంఛైజీ లో థర్డ్ పార్ట్ గా వస్తున్న ఈసినిమాలో నాని,అర్జున్ సర్కార్ పాత్రలో రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ఫంకీ హీరోయిన్ రేసులో కయాదు లోహర్
డ్రాగన్ తో సోషల్ మీడియాను ఊపేస్తోంది యంగ్ హీరోయిన్ కయాదు లోహర్.ఇందులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా కయాదు ఓ హీరోయిన్ గా చేసింది. నాలుగు రోజుల క్రితం విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.ముఖ్యంగా కయాదు గ్లామర్ యూత్ ను ఫిదా చేస్తుంది.ఈసినిమాతో తనకు వస్తున్న ఫాలోయింగ్ చూసి దర్శక నిర్మాతలు అప్ కమింగ్ ప్రాజెక్ట్ లలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట.

మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్
కాలేజ్ బ్యాక్ డ్రాప్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన 'మ్యాడ్' సినిమాకి సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరోసారి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

8 వసంతాలు నుండి త్వరలో ఫస్ట్ సింగిల్
మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్టైనర్లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా 'మను' ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా '8 వసంతాలు'ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ది ప్యారడైజ్ స్పెషల్ వీడియో రానుంది
దసరా కాంబినేషన్ రిపీట్ కానుందని తెలిసిందే.అందులో భాగంగా న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ లో నటించనున్నాడు.దసరాకు మించిన యాక్షన్ తో తెరకెక్కనుంది.ఇక ఈసినిమా నుండి స్పెషల్ వీడియో రానుంది. వచ్చే నెల 3న రా స్టేట్మెంట్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.రిలీజ్ డేట్ కూడా ప్రకటించే ఛాన్స్ వుంది.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ది ప్యారడైజ్ పై అంచనాలు భారీగా వున్నాయి.

శబ్దం నుండి హర్రర్ సాంగ్ రిలీజ్
‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’ కోసం చేతులు కలిపారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.