నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి కొలాబరేట్ అయ్యారు. ‘ది ప్యారడైజ్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దసరాకు మించిన యాక్షన్‌తో దీనిని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా నుండి స్పెషల్ వీడియో రానుంది. వచ్చే నెల 3న ‘రా స్టేట్‌మెంట్’ పేరుతో గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే ఈ గ్లింప్స్ బోల్డ్ అండ్ వైల్డ్‌గా ఉండబోతోంది. డైరెక్టర్ శ్రీకాంత్ దీనిని గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ మేరకు ప్యారడైజ్ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేస్తున్న నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అయితే నాని, అనిరుధ్ కలిసి పనిచేస్తున్న మూడవ చిత్రం ఇది. ఇంతకుముందు వీరి కాంబోలో ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్’ సినిమాలు వచ్చాయి. ఇవి మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా వున్నాయి.
శ్రీకాంత్ ఓదెల పవర్ ఫుల్ లార్జర్ దెన్ లైఫ్ కథను ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు. ఇది నానిని పూర్తిగా కొత్త, మాస్-డ్రైవ్ అవతార్‌లో ప్రజెంట్ చేయనుంది. కాగా ఈ చిత్రం ఇప్పటివరకు నాని యొక్క మోస్ట్ హై బడ్జెట్ వెంచర్ కావడం గమనార్హం. దసరా కాంబోలో వస్తోన్న ది ప్యారడైజ్‌పై అంచనాలు ఎక్కువగా వున్నాయి.
ఇక గత ఏడాది ‘సరిపోదా శనివారం’తో హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ కొట్టిన నాని నెక్స్ట్ హిట్ 3తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ దుమ్మురేపుతోంది. ఇందులో నాని చాలా వైలెంట్‌గా కనిపించాడు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈసినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మే 1న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: