టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ క్రేజీ మూవీ చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నందమూరి బాలకృష్ణ ఆల్ టైమ్ హిట్ త్వరలో రీ రిలీజ్‌కి కాబోతోంది. ఇండియన్ సినిమా చరిత్రలో మొట్టమొదటి సైంటిఫిక్ మూవీగా తెరకెక్కిన ‘ఆదిత్య 369’ ఈ వేసవిలో మళ్లీ విడుదలవుతోంది. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1991వ సంవత్సరం జూలై 18న విడుదలై కల్ట్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకుంది.
‘టైమ్ ట్రావెల్’ కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. మూడున్నర దశాబ్దాల క్రితమే ఇలాంటి ఆలోచనతో ఒక మూవీ రావడమే ఆశ్చర్యం. ఎలాంటి గ్రాఫిక్స్ అందుబాటులో లేని సమయంలోనే అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కడం విశేషం. ముఖ్యంగా ఇందులో టైమ్ మెషీన్ ఒక అద్భుతం అని చెప్పాలి.
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన మోహిని హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ నటులు అమ్రీష్ పురి విలన్‌గా, టినూ ఆనంద్ ముఖ్య పాత్రలో కనిపించారు. అలాగే అన్నపూర్ణ, సుత్తివేలు, శ్రీలక్ష్మి, సిల్క్ స్మిత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక హీరో తరుణ్ ఇందులో బాలనటుడిగా మరో కీలక పాత్రలో నటించాడు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అనితా కృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ గాయకులు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పించడం గమనార్హం. సుప్రసిద్ధ దర్శకులు జంధ్యాల ఈ సినిమాకి మాటలు రాయడం మరో విశేషం. లబ్దప్రతిష్టులైన గేయ రచయితలు వేటూరి సుందరరామమూర్తి మరియు సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు.
ఇక ఈ సినిమా సంగీతపరంగానూ ఆకట్టుకుంది. ఇసైజ్ఞాని ఇళయరాజా ఈ మూవీకి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలోని పాటలు చార్ట్ బస్టర్ అనిపించుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలు మ్యూజిక్ లవర్స్‌ని అలరిస్తుంటాయి. పి.సి.శ్రీరామ్, వి.ఎస్.ఆర్. స్వామి, కబీర్ లాల్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. సైన్స్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్ కథకు ఫిక్షన్‌ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ప్రత్యేక స్థానం పొందింది.
కాగా ఇటీవలే బాలకృష్ణ ఈ సినిమాకు సీక్వెల్ తీయనున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసారు. ఆయనే ఈ సెకండ్ పార్ట్ కి దర్శకత్వం వహించనుండటం మరింత విశేషం. అయితే ఈ మూవీ ద్వారా ఆయన తనయుడు మోక్షజ్ఞ తేజను హీరోగా ఇంట్రడ్యూస్ చేయనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆదిత్య 369 ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో బాలయ్య అభిమానులే కాకుండా సినీ ప్రియులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: