దసరా కాంబినేషన్ రిపీట్ కానుందని తెలిసిందే.అందులో భాగంగా న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ లో నటించనున్నాడు.దసరాకు మించిన యాక్షన్ తో తెరకెక్కనుంది.ఇక ఈసినిమా నుండి స్పెషల్ వీడియో రానుంది. వచ్చే నెల 3న రా స్టేట్మెంట్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.రిలీజ్ డేట్ కూడా ప్రకటించే ఛాన్స్ వుంది.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ది ప్యారడైజ్ పై అంచనాలు భారీగా వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత ఏడాది సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ కొట్టిన నాని నెక్స్ట్ హిట్ 3 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.నిన్న ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.ఇందులో నాని చాలా వైలెంట్ గా కనిపించాడు.ఈసినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈసినిమా మే 1న థియేటర్లలోకి తీసుకురానున్నారు.
ఇక హీరోగానే కాదు అటు నిర్మాత గా కూడా నాని వరుసగా సినిమాలను నిర్మిస్తున్నాడు.అందులో భాగంగా నాని బ్యానర్ నుండి నెక్స్ట్ కోర్ట్ అనే సినిమా విడుదలకానుంది.ప్రియదర్శి కీలక పాత్రలో నటించాడు.మార్చి 14న విడుదలకానుంది.అలాగే మెగాస్టార్ చిరంజీవి ,శ్రీకాంత్ ఓదెల సినిమాకు నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: