సరికొత్త రికార్డు  సృష్టించిన లక్కీ భాస్కర్ 

Lucky Bhaskar is the First South Indian film to trend for 13 weeks straight on netflix

గత ఏడాది దీపావళికి వచ్చి ఊహించని విజయాన్ని సాధించింది లక్కీ భాస్కర్.ఫుల్ రన్ లో 120కోట్లకుపైగా వసూళ్లను సాధించి సెన్సేషన్ సృష్టించింది. ఈసినిమా తో దుల్కర్ సల్మాన్ కెరీర్ లో మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.ఒక్క తెలుగులోనే కాదు తమిళ, మలయాళంలోనూ ఈసినిమా సూపర్ రన్ ను కొనసాగించింది. ఇక థియేట్రికల్ రిలీజ్ తరువాత ఓటిటిలోకి వచ్చి అక్కడ కూడా సెన్సేషనల్ వ్యూస్ తో దూసుకుపోతుంది.ఈ క్రమంలో ఏ సౌత్ ఇండియన్ మూవీ సాధించని అరుదైన రికార్డు సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేంటంటే లక్కీ భాస్కర్ 13 వారాలనుండి నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.బ్యాంకింగ్ బ్యాక్ డ్రాప్ లో వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈసినిమాలో దుల్కర్ టైటిల్ రోల్ లో నటించగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేసింది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.నాగవంశీ ,సాయి సౌజన్య ఈసినిమాను నిర్మించారు.

ఇక దుల్కర్ హీరోగా ప్రస్తుతం తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు.పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తుండగా సందీప్ గుణ్ణం ,రమ్య గుణ్ణం ఈసినిమాను నిర్మిస్తున్నారు.రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.దుల్కర్ వరుసగా తెలుగులో రెండో బ్లాక్ బస్టర్ కొట్టడం తో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమాతో పాటు దుల్కర్ ,కాంత అనే పాన్ ఇండియా సినిమా కూడా చేస్తున్నాడు.రానా దగ్గుబాటి ఈసినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.