గుడ్ బ్యాడ్ అగ్లీ.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Good Bad Ugly Teaser Release Date Announced

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ సహా ఇతర ప్రచారచిత్రాలకుట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏప్రిల్ 10న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 28న దీనిని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు మైత్రీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. కాగా ఈ చిత్రం తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను రోమియో పిక్చర్స్ దక్కించుకుంది.

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మార్క్ ఆంటోని’తో విజయాన్ని అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా గుడ్ బ్యాడ్ అగ్లీని తీసుకువస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన వెర్సటైల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆడియన్స్‌కు గ్రేట్ ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించడానికి సిద్ధంగా ఉంది.

నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టాప్ టెక్నికల్ టీం పని చేస్తున్న ఇండియన్ సినిమాలో ఒక హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్‌, జి ఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.