గత ఏడాది రెండు సినిమాలతో వచ్చిన మాస్ రాజా రవితేజకు ఆ సినిమాలు విజయాన్ని అందించలేకపోయాయి.ఇక తను నెక్స్ట్ మాస్ జాతర తో రానున్నాడు.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్.రవితేజకు ఇది 75వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ విషయానికి వస్తే రీసెంట్ గా అరకు షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఈనెల 28న నుండి నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకు గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు.త్వరలోనే మరో అప్డేట్ ఇవ్వాలని చూస్తున్నారు.ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.మే 9న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.రవితేజ వరసగా నిరాశపరుస్తుండడంతో మాస్ జాతర తోనైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇదిలావుంటే ఓ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే రవితేజ ప్రస్తుతం కొంచెం స్లో అయ్యాడు.మాస్ జాతర తరువాత ఇప్పటివరకు మరో సినిమాను ఓకే చేయలేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: