కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie Updates

ట్యాగ్ · 72 కథనాలు · పేజీ 4

సినిమా వార్తలు

హ్యాపీ బర్త్‌ డే జెన్నూ

హీరో రామ్, జెనీలియా మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. 2008లో వచ్చిన ‘రెడీ’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటినుండి వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ రోజు జెనీలియా పుట్టిన రోజు కావడంతో తన ట్విట్టర్‌ వేదికగా ఆమెకు బర్త్‌డే విషేస్‌ తెలిపాడు రామ్. ‘ఎవరైనా ఏది కావాలన్నా అడగగలిగే సెల్ఫ్ లెస్ మరియు కేరింగ్ ఫ్రెండ్ నువ్వు.. హ్యాపీ బర్త్‌ డే జెన్నూ. రానున్న సంవత్సరాలు మరింత ఉత్తమంగా ఉండాలని ఆశిస్తున్నాను. త్వరలోనే ఇదే రోజున మనందరం మరోసారి కలుసుకుందాం’ అంటూ ట్వీట్‌ చేశారు రామ్‌. అంతేకాక జెనీలియా కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్‌ చేశారు. దీనిలో జెనీలియా, ఆమె భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వాటర్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డా..!

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నందిత తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం నందిత 'ఐపీసీ 376' అనే సినిమాలో నటిస్తుంది. రామ్ కుమార్ సుబ్బరాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రభాకర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.

TFN Adminవాట్సాప్
Actress Rakul Preet Singh Hits 15 Million Follower Mark On Instagram
సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ ఇన్ స్టాగ్రామ్ లో 15 మిలియన్ ఫాలోవర్స్

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. హీరోయిన్ రకుల్ ప్రస్తుతం "ఎటాక్ ", "ఛలే ఛలో"(హిందీ ), "అయిలాన్ ", "ఇండియన్ 2"(తమిళ ), ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు రకుల్ ఇన్ స్టా గ్రామ్ లో 15 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'కీర్తి సురేష్' కు తల్లిగా 'నయన తార'..?

శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి కూడా విదితమే. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పుడు 'పాయల్'.. ఇప్పుడు 'శర్వా'..!

మొదటి సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 మూవీతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పటివరకూ మరే సినిమాను డైరెక్ట్ చేయలేదు. మరోపక్క ఆర్ఎక్స్ 100లో నటించిన కార్తికేయ, పాయల్ మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ సినిమా తర్వాత మహాసముద్రం సినిమా అనుకున్నాడు. అయితే దానికి హీరో సెట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది అజయ్ భూపతికి. ఫైనల్ గా శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'శర్వా' కొత్త సినిమా అఫీషియల్‌గా అనౌన్స్‌ మెంట్

ఈ ఏడాది 'జాను' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. అయితే ఆ సినిమా అంత విజయం అందించలేకపోయింది. ఇక జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ‘శ్రీ‌కారం’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే తెలుగు-త‌మిళ భాషలో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

కరోనా పై ప్రశాంత్ వర్మ సినిమా - స్పెషల్ డే కి ఫస్ట్ లుక్..!

కరోనా నేపథ్యంలో ప్రశాంత్ వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయం ఇప్పటికే ప్రకటించాడు కూడా. ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి.. ఇప్ప‌టికే 40 శాతం పూర్తి చేసుకున్న‌ట్టు తెలుస్తుంది‌. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ కర్నూలులో ప్ర‌త్యేకంగా ఓ సెట్ ను కూడా వేశాడ‌ట‌.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆర్తి అగర్వాల్ బయోపిక్ మూవీ ?

సూపర్ హిట్ "నువ్వు నాకు నచ్చావ్ "మూవీ తో ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "నువ్వు లేక నేను లేను ", "ఇంద్ర ", "వసంతం ", "నేనున్నాను ", "అందాలరాముడు " మూవీస్ తో ఆర్తి అగర్వాల్ ప్రేక్షకులను అలరించారు . టాలీవుడ్ స్టార్ హీరోస్ తో సూపర్ హిట్ మూవీస్ లో నటించిన ఆర్తి అగర్వాల్ బరువు తగ్గడానికి జరిగిన లైపో ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చిన్న వయసు లోనే కన్ను మూశారు. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ మూవీ రూపొందనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"గూఢచారి " మూవీ టీమ్ , అభిమానులకు థ్యాంక్స్ -అడివి శేష్

అభిషేక్ పిక్చర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , విస్టా డ్రీమ్ మర్చంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "గూఢచారి " మూవీ 2018 సంవత్సరం ఆగస్ట్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శోభిత ధూళిపాళ , మధుశాలిని , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. సక్సెస్ ఫుల్ "గూఢచారి " మూవీ కి సీక్వెల్ "గూఢచారి 2" మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్కూల్ కట్టిస్తున్న క్రియేటివ్ డైరెక్టర్..!

సినిమాలే కాదు సేవా కార్యక్రమాలు చేయడంలోనూ మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎప్పుడూ ముందుంటారన్న సంగతి పలు సందర్భాల్లో ఇప్పటికే చూశాం. ఇక ఇప్పటికే ఎంతో మంది తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే కొంతమంది చేసినవి బయటకొస్తే కొంతమంది చేసిన పనులు బయటకు రావు. ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఒక స్కూల్ కట్టిస్తున్నారట.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆరు గెటప్స్ లో ఎన్టీఆర్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులు గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్, పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రౌద్రం రణం రుధిరం "మూవీ 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. అలియా భట్ , ఒలీవియా కథానాయికలు కాగా అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

"ఆకాశవాణి " మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ రిలీజ్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఏ యు &ఐ బ్యానర్ పై "ఆకాశవాణి " మూవీ రూపొందుతుంది. ఒకప్పుడు ప్రజలకు వినోద సాధనంగా ఉన్న రేడియో నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుంది. "ఆకాశవాణి " మూవీ కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్