
ట్యాగ్ · 12 కథనాలు


రవితేజ 'రావణాసుర' లో అక్కినేని హీరో

సుశాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీ "IVNR"

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' ట్రైలర్ రిలీజ్

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' రిలీజ్ డేట్ ఫిక్స్
షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'
'ఇచ్చట వాహనములు నిలుపరాదు' షూటింగ్ రీస్టార్ట్
మరోసారి జంటగా నాగచైతన్య , సమంత ?
చైతు-సామ్ నుండి అదే నేర్చుకోవాలి..!

రవితేజ ‘రావణాసుర ప్రారంభం.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..!
రవితేజ మాత్రం తన స్పీడును అస్సలు తగ్గించట్లేదు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ లిస్ట్ లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అయినా కూడా కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం 'ఖిలాడి' చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకోగా 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా వంశీ అనే డైరెక్టర్ తో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

రవితేజ 'రావణాసుర' లో అక్కినేని హీరో
ఈమధ్య హీరోలు కూడా తమ పంథాను మార్చేశారు. అన్ని రకాలుగా ప్రయోగాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అంతేకాదు విలన్ పాత్రలకు పెరుగుతున్న క్రేజ్ ను చూసి నెగెటివ్ షేడ్ లో కూడా కనిపించడానికి అస్సలు వెనుకాడట్లేదు. అంతేకాదు పాత్ర నచ్చితే వేరే సినిమాల్లో కూడా చేసేస్తున్నారు. అలా చేసే వారిలో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఉన్నాడు. అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుశాంత్ కు సక్సెస్ రేటు కాస్త తక్కువే అని చెప్పొచ్చు. చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అందుకే చాలా కాలం సినిమాలకు దూరంగా కూడా ఉన్నారు. అయితే ఆమధ్య వచ్చిన 'చి.ల.సౌ' సినిమాతో ఒక డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఆతర్వాత అల వైకుంఠపురములో…

సుశాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీ "IVNR"
సక్సెస్ ఫుల్ "కాళిదాసు " మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయిన సుశాంత్ "కరెంట్ ", "చి.ల.సౌ" , "అల .. వైకుంఠపురములో .." వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ గా నో పార్కింగ్ క్యాప్షన్ తో రూపొందిన "ఇచ్చట వాహనములు నిలుపరాదు" మూవీ ఈ రోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా పాత్రికేయులతో సుశాంత్ ముచ్చటించారు.

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' ట్రైలర్ రిలీజ్
సరైన హిట్ కోసం ఎదురుచూసే హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కూడా ఉన్నాడు. అప్పుడెప్పుడో చి.ల.సౌ సినిమాతో ఒక మంచి సినిమాను తన ఖాతాలో వేసుకున్నా ఆ తరువాత మరో సినిమా చేయలేదు. మధ్యలో అల వైకుంఠపురములో సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మరోసారి హీరోగా ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో రాబోతున్నాడు. ఎస్. దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా. ఇప్పటికే ఈసినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కింగ్ నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'
ఎస్. దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా వస్తున్న సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా థియేటర్లు తెరుచుకోవడంతో ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. రీసెంట్ గానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఆగష్ట్ 27 న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ అందించారు.

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' రిలీజ్ డేట్ ఫిక్స్
కోరనా ప్రభావం చాలా వరకూ తగ్గింది. అలానే థియేటర్లు కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో మేకర్స్ వీలైనంత త్వరగా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు . గత వారం పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా.. ఈ శుక్రవారం కూడా దాదాపు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకొని థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకోగా ఇప్పుడు కూడా తన సినిమాతో వచ్చేస్తున్నాడు సుశాంత్.

"ఇచ్చట వాహనములు నిలుపరాదు" న్యూ పోస్టర్ రిలీజ్
ఏ1 స్టూడియోస్ అండ్ శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై దర్శన్ ఎస్ దర్శకత్వంలో సుశాంత్ ,మోడల్ , హర్యానా ఫెమినా మిస్ ఇండియా (2018 )మీనాక్షి చౌదరి జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ “ఇచ్చట వాహనములు నిలుప రాదు “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో మీనాక్షి చౌదరి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. వెన్నెల కిషోర్ ఒక ముఖ్య పాత్రలో నటించారు . ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు .
ప్రభాస్ చేతుల మీదుగా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' టీజర్
చిలసౌ సినిమా తర్వాత సుశాంత్ హీరోగా మళ్లీ ఇంతవరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఆ పాత్రకు మంచి పేరే వచ్చిందనుకోండి. ఇక ప్రస్తుతం ఎస్ దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' 'నో పార్కింగ్' అనేది ట్యాగ్ లైన్. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాలి కానీ కరోనా వల్ల చాలా లేట్ అయిపోయింది.
షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'
కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ లకు దూరంగా ఉండగా.. ఇప్పుడు అలా షూటింగ్ మొదలుపెడుతున్నారో లేదో షూటింగ్ ను పూర్తి చేసేస్తున్నారు టాలీవుడ్ హీరోలు. సినిమా రిలీజ్ సంగతి తర్వాత ముందు సినిమా పూర్తి అయితే తర్వాత రిలీజ్ సంగతి ఆలోచించొచ్చు అన్న ప్లాన్ లో ఉన్నారు. ఇక ఇప్పటీకే పలువురు హీరోలు షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఇప్పుడు తాజాగా సుశాంత్ కూడా తన సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు.
'ఇచ్చట వాహనములు నిలుపరాదు' షూటింగ్ రీస్టార్ట్
S. దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సుశాంత్ డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడని అర్ధమవుతుంది. ఇక ఇటీవల సెప్టెంబర్ 20 నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్‌ను స్టార్ట్ చేస్తున్న సుశాంత్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.
మరోసారి జంటగా నాగచైతన్య , సమంత ?
హీరో నాగచైతన్య , సమంత జంటగా "ఏ మాయ చేసావె ", "మనం ", "ఆటో నగర్ సూర్య ", "మజిలీ " మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి జంటగా నటించనున్నారని సమాచారం. లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , యోగా , ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తూ సమంత టైమ్ పాస్ చేస్తున్నారు.
చైతు-సామ్ నుండి అదే నేర్చుకోవాలి..!
లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమైన సోషల్ డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాకు మాత్రం దగ్గరగానే ఉంటూ అభిమానులకు మాత్రం అందుబాటులోనే వుంటున్నారు. ఇక ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించగా.. తాజాగా సుశాంత్ కూడా తన అభిమానులతో ముచ్చటించి పలు విషయాలు పంచుకున్నారు.