సక్సెస్ ఫుల్ “కాళిదాసు ” మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయిన సుశాంత్ “కరెంట్ “, “చి.ల.సౌ” , “అల .. వైకుంఠపురములో ..” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ గా నో పార్కింగ్ క్యాప్షన్ తో రూపొందిన “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ ఈ రోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా పాత్రికేయులతో సుశాంత్ ముచ్చటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో సుశాంత్ మాట్లాడుతూ … తన దగ్గరకు వచ్చిన కథల్లో మనసుకు నచ్చినవి ఎంచుకొని సినిమాలు చేస్తున్నాననీ , .‘చి.ల.సౌ’ చిత్రం నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా నచ్చిన సినిమాలు మాత్రమే అంగీకరిస్తున్నాననీ , దర్శన్ “ఇచ్చట వాహనములు నిలుపరాదు” మూవీ కథ చెబుతున్నప్పుడే గొప్ప అనుభూతి కలిగిందనీ , నటనకు ఆస్కారమున్న పాత్ర అనీ , తొలిసారి భిన్న ఛాయలున్న పాత్ర పోషించాననీ , ఈ తరహా కథతో ఇటీవల కాలంలో తెలుగులో మరో సినిమా రాలేదనీ , కొత్తగా ఉండడంతో పాటు వాణిజ్య హంగులున్న చిత్రం ఇదనీ , ఇప్పటిదాకా తాను నటించిన చిత్రాల్లో ఇదే బెస్ట్ అనుకుంటున్నాననీ , తన పాత్ర సరదాగా ఉంటుందనీ , .నటుడిగా సంతృప్తి చెందాననీ , ప్రేక్షకులను అలరించే చిత్ర మనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: