S. దర్శన్ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్‌కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సుశాంత్ డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడని అర్ధమవుతుంది. ఇక ఇటీవల సెప్టెంబర్ 20 నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్‌ను స్టార్ట్ చేస్తున్న సుశాంత్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు చిత్రయూనిట్. ప్రస్తుతం హీరో హీరోయిన్లు సుశాంత్, మీనాక్షి చౌదరి లపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: