
ట్యాగ్ · 13 కథనాలు


'సీతా రామం' ఎపిక్ అవుతుంది..!

"83 " మూవీ లో రణ్ వీర్ సింగ్ కు సుమంత్ వాయిస్

సుమంత్ "అహం రీబూట్ " మూవీ ప్రారంభం

'మళ్ళీ మొదలైంది' లో పోసాని

'సుమంత్' కొత్త సినిమా ప్రారంభం
ఏఎన్నార్ దత్త పుత్రుడు - హ్యాపీ బర్త్ డే సుమంత్
'అనగనగా ఒక రౌడీ' - 'వాల్తేరు శీను' గా సుమంత్
'కపటధారి' సెన్సార్ పూర్తి.. క్రిస్మస్ కు రిలీజ్
'కపటధారి' టీజర్ రీలీజ్

'సీతారామం' సుమంత్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, పడి పడి లేచే మనసు లాంటి ప్రేమ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ హను రాఘవపూడి. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుండగా.. పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిలటరీ ప్రేమ కథగా ఈసినిమా రాబోతుందని అర్థమవుతుంది. ఇక ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

సుమంత్ "అహం రీబూట్ " ఫస్ట్ లుక్ రిలీజ్
సుమంత్ కూడా చిన్నగా ఒక సినిమా తర్వాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు ఇప్పుడు తను ఎంచుకునే సినిమాల్లో విభిన్నత ఉండేలా చూసుకుంటున్నాడు. ఇటీవలే తను నటించిన మళ్ళీ మొదలైంది సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది. ఇంకా అనగనగా ఒక రౌడీ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కావాల్సింది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

'సీతా రామం' ఎపిక్ అవుతుంది..!
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో మృణాళిని ఠాకూర్ సీత పాత్ర లో కనిపించనుంది. అఫ్రీన్ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా రష్మిక నటిస్తోంది. రీసెంట్ గానే ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సుమంత్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సుమంత్ తన సోషల్ మీడియా ద్వారా ఒక ఫొటో పోస్ట్ చేస్తూ ఈసినిమా పై ప్రశంసలు కురిపించారు. ఈఫొటోలో దుల్కర్, దర్శకుడు హను అలాగే హీరోయిన్ మృణాల్…

'అనగనగా ఒక రౌడీ' సుమంత్ బర్త్ డే పోస్టర్ రిలీజ్
సుమంత్ కూడా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కపటధారి సినిమాతో అలరించిన సుమంత్.. ఇప్పుడు పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తను చేసిన మళ్ళీ మొదలైంది సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమా ఫిబ్రవరి 11న ఈ సినిమా నేరుగా జీ5 ఓటీటీ వేదికగా విడుదల కానుంది. రెడ్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా. శివకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు.

"83 " మూవీ లో రణ్ వీర్ సింగ్ కు సుమంత్ వాయిస్
కబీర్ ఖాన్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ , దీపికా పడుకొనే జంటగా 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "83 " హిందీ మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ మూవీ లో ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ గా రణ్ వీర్ సింగ్, ఆయన భార్యగా దీపికా పడుకొనే నటించారు. ప్రీతమ్ సంగీతం అందించగా జూలియస్ పసికియం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. "83 " మూవీ హిందీ తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

సుమంత్ "అహం రీబూట్ " మూవీ ప్రారంభం
కొత్తదనంతో కూడుకున్న కథాంశాల్ని ఎంచుకొని సినిమాలలో నటిస్తున్న హీరో సుమంత్. తాజాగా ఆయన వినూత్న కథా చిత్రంలో నటిస్తున్నారు. వాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై ప్రశాంత్‌సాగర్ అట్లూరి దర్శకత్వంలో సుమంత్ హీరోగా తెరకెక్కనున్న "అహం రీబూట్ " మూవీ సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకొంది. రఘవీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మాతలు.

'మళ్ళీ మొదలైంది' లో పోసాని
కీర్తికుమార్ దర్శకత్వంలో సుమంత్ మళ్ళీ మొదలైంది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా పెళ్లి తరువాత లైఫ్ ఎలా ఉంటుందో అన్న విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో మరో కీలక పాత్రలో పోసాని నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

'సుమంత్' కొత్త సినిమా ప్రారంభం
హీరో సుమంత్ కూడా జయాపయాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎక్కువ కమర్షియల్ హంగులకు పోకుండా.. తనకు సూటయ్యే పాత్రలు చేసే నటుల్లో సుమంత్ కూడా ఒకడు. సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్, కపటధారి సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం. ప్రస్తుతం మను యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈసినిమాలో వాల్తేరు శీను అనే పాత్రలో సుమంత్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లను చూస్తే తెలుస్తుంది. ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గార్లపాటి రమేష్, డాక్టర్ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్…

'అనగనగా ఒక రౌడీ' షూటింగ్ పూర్తి .. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్
సుమంత్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే 'కపటధారి' అనే సినిమాతో అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. మను యజ్ఞ దర్శకత్వంలో 'అనగనగా ఒక రౌడీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో సుమంత్ వాల్తేరు శీను గా నటించనున్నాడు. ఇక ఈసినిమాలో ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లను బట్టి తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ విశాఖలోనే జరుపుకుంది.
ఏఎన్నార్ దత్త పుత్రుడు - హ్యాపీ బర్త్ డే సుమంత్
ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. కానీ వారి సినీ కెరీర్ మాత్రం తమలోని నటన.. సినిమాలను ఎంచుకునే విధానం పై ఆధారపడి ఉంటుంది. ఇక తాత ఏయన్నార్ సినీ చరిత్రలోనే ఒక దిగ్గజం.. మామ నాగార్జున అగ్ర హీరో.. వారి ఆశీస్సులతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి వారసత్వ హీరో సుమంత్. తాత పోలికలు పుష్కలంగా పునికిపుచ్చుకున్న మనవడు సుమంత్. అంతేకాదు మొదటి వారసుడు కావడంతో సుమంత్ అంటే ఏయన్నార్ కి అమితమైన ప్రేమ. అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా వుండే ఏఎన్నార్ కు ఒక సినిమా షూటింగ్ టైం లో హార్ట్ ఎటాక్ రావడంతో హార్ట్ సర్జరీ చేసారు. సర్జరీ జరినప్పుడు ఇంట్లోనే ఏడాది పాటు ఉండాల్సి వచ్చిందట. ఆ సమయంలోనే సుమంత్…
'అనగనగా ఒక రౌడీ' - 'వాల్తేరు శీను' గా సుమంత్
సుమంత్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ 'కపటధారి' అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా న థియేటర్ లో రిలీజ్ కానుంది.
'కపటధారి' సెన్సార్ పూర్తి.. క్రిస్మస్ కు రిలీజ్
ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ఇప్పుడు 'కపటధారి' అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
'కపటధారి' టీజర్ రీలీజ్
సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు.