సుమంత్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ‘కపటధారి’ అనే సినిమాతో అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. మను యజ్ఞ దర్శకత్వంలో ‘అనగనగా ఒక రౌడీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో సుమంత్ వాల్తేరు శీను గా నటించనున్నాడు. ఇక ఈసినిమాలో ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లను బట్టి తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ విశాఖలోనే జరుపుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ పూర్తయినట్టు సుమంత్ అధికారికంగా తెలిపారు. సినిమా షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
Shoot done and in post production! #AnaganagaOkaRowdy 💥
Pls stay safe 😷💉 pic.twitter.com/jj1aB8PPtg
— Sumanth (@iSumanth) May 1, 2021
ఈ సినిమాను ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గార్లపాటి రమేష్, డాక్టర్ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో ఇంకా మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: