ట్యాగ్ · 73 కథనాలు · పేజీ 4
'శ్యామ్ సింగ రాయ్' కోల్‌కతా షెడ్యూల్ ప్రారంభం
'టక్ జగదీష్' నుండి రాబోతున్న మ్యాజికల్ మెలోడీ
'టక్ జగదీష్' డబ్బింగ్ మొదలు
ఎంసీఏ - నాని-సాయి పల్లవి కామెడీ సీన్
భార్య కు నాని బర్త్ డే విషెస్ - గుడ్ కంపెనీ
నాని 28 టైటిల్ రిలీజ్
#Nani28 కాంబినేషన్ సెట్ - త్వరలో టైటిల్ ప్రకటన
స్పెషల్ రోల్ లో హీరో నాని

జున్ను తో నాని స్వీట్ మూమెంట్స్
మరో ఛాలెంజింగ్ రోల్ లో నాని
టీజర్, ఫస్ట్ లుక్ రెడీ.. నాని డబుల్ ధమాకా
న్యాచురల్ స్టార్ నాని తన ఫ్యాన్స్ కు మంచి గుడ్ న్యూస్ చెప్పాడు. బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఫిబ్రవరి 24 నాని పుట్టిన రోజు అని తెలిసిందే కదా. ఈ తనపుట్టిన రోజున ఈ రెండు సినిమాల సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. టక్ జగదీష్ సినిమా నుండి టీజర్ ను, శ్యామ్ సింగరాయ్ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ రెడీ అయిందని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. మరి ఆ సర్‌ప్రైజ్‌లు చూడాలంటే నాని పుట్టిన రోజు వరకూ ఆగాల్సిందే.
'శ్యామ్ సింగ రాయ్' కోల్‌కతా షెడ్యూల్ ప్రారంభం
టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ మూవీలో ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన కొత్తగా మేకోవర్ అయ్యారు కూడా.
'టక్ జగదీష్' నుండి రాబోతున్న మ్యాజికల్ మెలోడీ
డిఫరెంట్ కథలను చేయడంలో నాని ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి 'టక్ జగదీష్'. ‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. అంతేకాదు చాలా కాలం తర్వాత మళ్లీ మాస్ అండ్ కమర్షియల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నాడు నాని. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫుల్ మాస్ లుక్ లో ఉన్న నాని స్టిల్ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 23 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే…
అప్పుడు 'రైడ్' కి కలిసొచ్చింది - ఇప్పుడు 'అల్లుడు అదుర్స్' కి
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈ సినిమా ట్రయిలర్ ను కూడా నిన్న రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. సాయి శ్రీనివాస్ కూడా యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఈసారి కామెడీపై కూడా ద్రుష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. మంచి కామెడీ యాంగిల్ ను కూడా బయటపెట్టాడు.
'టక్ జగదీష్' డబ్బింగ్ మొదలు
వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫుల్ బిజీలో ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నాని ‘నిన్ను కోరి ' సినిమా తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్‌లో 26వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసిన `టక్ జగదీష్ ఫస్ట్‌లుక్`కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఎంసీఏ - నాని-సాయి పల్లవి కామెడీ సీన్
దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి). భూమిక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. 2018 డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి పాజిటివ్ టాకే సంపాదించుకుంది. ఇక నాని న్యాచురల్ యాక్టింగ్ తో క్లీన్ కామెడీ ఎంటర్ టైన్మెంట్ తో..వదిన, మరిదిల మధ్య గల బంధాన్ని అందంగా చెప్పిన సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
భార్య కు నాని బర్త్ డే విషెస్ - గుడ్ కంపెనీ
సోషల్ మీడియాలో నాని ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటాడు. సినిమాలకు సంబంధించిన విషయాలే కాదు వ్యక్తిగత విషయాలు కూడా అభిమానులతో షేర్ చేసుకుంటాడు. ఇక ఇదిలా ఉండగా ఈ రోజు నాని సతీమణి అంజనా పుట్టినరోజు. ఈ సందర్భంగా నాని అంజనాకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేసాడు. ఫ్లయిట్ లో ఉన్న తమ ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే అంజనా.. లాంగ్ ఫ్లయిట్ కానీ నువ్వు ఇద్దరికీ మంచి కంపెనీ ఇచ్చావు అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
నాని 28 టైటిల్ రిలీజ్
బ్రోచేవారెవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అంతేకాదు ఈ రోజు ఈ సినిమా నుండి సర్ ప్రయిజింగ్ అప్ డేట్ ఇస్తామని చెప్పిన సంగతి కూడా విదితమే. ఇక చెప్పినట్టే ఈ సినిమా నుండి అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు 'అంటే సుందరానికి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రొమాంటిక్ ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది.
#Nani28 కాంబినేషన్ సెట్ - త్వరలో టైటిల్ ప్రకటన
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను... సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
స్పెషల్ రోల్ లో హీరో నాని
హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. "టక్ జగదీష్ " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ తరువాత నాని, దర్శకులు రాహుల్ సంక్రుత్యన్ , వివేక్ ఆత్రేయ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

జున్ను తో నాని స్వీట్ మూమెంట్స్
లాక్ డౌన్ మాత్రం హీరోలకు తమ పిల్లలతో కాస్త కాలక్షేపం చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా వుండే వాళ్లకి ఈ సమయం కాస్త కలిసొచ్చిందనే చెప్పొచ్చు. మళ్లీ ముందు ముందు ఇన్ని నెలలు వాళ్లకు టైం దొరుకుతుందో లేదో అందుకే హీరోలు కూడా ఇంట్లో వాళ్లతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో నాని కూడా తన కొడుకు జున్ను తో కలిసి ఆటలు ఆడుతూ స్వీట్ మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు జున్ను తో కలిసి ఈ మధ్య ఆన్ లైన్ క్లాస్ లో కూడా పాల్గొన్న రోజులున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా అర్జున్‌తో తీసుకున్న ఫొటోలను నాని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నవంబర్ నెలకు వెల్ కమ్ చెప్పాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్…
మరో ఛాలెంజింగ్ రోల్ లో నాని
హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న "టక్ జగదీష్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత సూప్ హిట్ "బ్రోచేవారెవరురా "మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక మూవీని హీరో నాని ఓకే చేశారు. వరస చిత్రాలతో హీరో నాని బిజీగా ఉన్నారు.

"V" మూవీ సాంగ్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ప్రముఖ OTT అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. అమిత్ త్రివేది సాంగ్స్ స్వరపరచగా, థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ "V" మూవీ పై అంచనాలను పెంచాయి.