జున్ను తో నాని స్వీట్ మూమెంట్స్

Natural Star Nani Shares An Adorable Picture Of His Son On Instagram

లాక్ డౌన్ మాత్రం హీరోలకు తమ పిల్లలతో కాస్త కాలక్షేపం చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా వుండే వాళ్లకి ఈ సమయం కాస్త కలిసొచ్చిందనే చెప్పొచ్చు. మళ్లీ ముందు ముందు ఇన్ని నెలలు వాళ్లకు టైం దొరుకుతుందో లేదో అందుకే హీరోలు కూడా ఇంట్లో వాళ్లతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో నాని కూడా తన కొడుకు జున్ను తో కలిసి ఆటలు ఆడుతూ స్వీట్ మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు జున్ను తో కలిసి ఈ మధ్య ఆన్ లైన్ క్లాస్ లో కూడా పాల్గొన్న రోజులున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా అర్జున్‌తో తీసుకున్న ఫొటోలను నాని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నవంబర్ నెలకు వెల్ కమ్ చెప్పాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు ఈ ఫొటోపై హీరోయిన్లు కీర్తీ సురేష్, మంచు లక్ష్మి తదితరులు కామెంట్లు కూడా చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

 

View this post on Instagram

 

November 🙂

A post shared by Nani (@nameisnani) on

ఇక మరోవైపు నాని పలు సినిమాలతో బిజీగా వున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం లో నాని హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సుమారు 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “టక్ జగదీష్ ” మూవీ కరోనా కారణం గా షూటింగ్ వాయిదా పడింది. ఈ మధ్యే ఈ సినిమా షూట్ ను కూడా మొదలుపెట్టారు.

ఈ మూవీ తరువాత రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో “శ్యామ్ సింగ రాయ్ “, “బ్రోచేవారెవరురా “మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =