ఎంసీఏ – నాని-సాయి పల్లవి కామెడీ సీన్

Watch Nani and Sai Pallavi comedy scene from MCA Movie

దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి). భూమిక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. 2018 డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి పాజిటివ్ టాకే సంపాదించుకుంది. ఇక నాని న్యాచురల్ యాక్టింగ్ తో క్లీన్ కామెడీ ఎంటర్ టైన్మెంట్ తో..వదిన, మరిదిల మధ్య గల బంధాన్ని అందంగా చెప్పిన సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఫిదా సినిమాతో 2017లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి.. భానుమతి ఒక్కటే పీస్ అంటూ కుర్రకారు మదిని కొల్లగొట్టిన సాయి పల్లవి తొలిసారి ఈ సినిమాలో నానితో జతకట్టింది. ఇక సాయిపల్లవి తో నాని కామెడీ కూడా చాలా బాగా ఉంటుంది. ఇద్దరు న్యాచురల్ స్టార్స్ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నాని-సాయి పల్లవి కాంబినేషన్ కూడా అలానే ఉంటుంది. ఇద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ కూడా అలానే ఉంటాయి. వారి కామెడీ సీన్స్ నుండి మీకోసం ఒక కామెడీ సీన్ చూసి నవ్వుకోండి.

ఇక ఇదిలా ఉండగా టాక్సీవాలా ఫేమ్‌ రాహుల్‌ సంక్రీత్యన్‌ దర్శకత్వంలో నాని శ్యామ్‌ సింగరాయ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే‌. కోల్‌కతా నేపథ్యంలో వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కూడా సాయి పల్లవి నానితో జత కట్టనుంది. మరి స్పెషల్ గా చెప్పేదేముంది.. ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో. కాగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =