ట్యాగ్ · 34 కథనాలు · పేజీ 2

22 ఏళ్లకే చిరు ని డైరెక్ట్ చేశా
'ఆచార్య' షూటింగ్ లో అప్పుడే

దీపావళి సెల్ఫీ
మెగా అభిమానులకు శుభవార్త
చిరంజీవి కోలుకోవాలని లారెన్స్ స్పెషల్ పూజ
'చిరు' లేకుండానే 'ఆచార్య' షూటింగ్
అన్నయ్య త్వరగా కోలుకోవాలి
మెగాస్టార్ కు కరోనా పాజిటివ్
'ఆచార్య' కూడా రెడీ అవుతున్నాడు

మనవరాళ్ల సాయంతో చిరు వంట
చిరంజీవి రెడీ ఫర్ షూటింగ్
మెగా స్టార్ చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ ?
థియేటర్స్ కు గ్రీన్ సిగ్నల్ .. కేసీఆర్ కు చిరు కృతజ్ఞతలు
కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు సినీ రంగానికి కూడా భారీ నష్టమే కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే కాస్త ఎక్కువ నష్టమే కలిగిందని చెప్పొచ్చు. థియేటర్స్ మూత పడటం.. షూటింగ్ లు చేయలేని పరిస్థితి.. మరో పక్క కరోనా వల్ల ఎంతో మంది సెలెబ్రిటీస్ మరణించడం.. సినీ కార్మికులకు ఇబ్బందులు ఇలా చాలా సమస్యలు ఇండస్ట్రీని కుదేలు చేశాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు పెడుతున్నారు. కొన్ని సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.

22 ఏళ్లకే చిరు ని డైరెక్ట్ చేశా
తెలుగు తెరకి అపురూప చిత్రాలను అందించిన సీనియర్ డైరెక్టర్ వంశీ. ఆయన కథలు వాస్తవానికి దగ్గరగా .. ఆయన కథల్లోని పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అంతేకాదు ఒక సినిమాను చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసే డైరెక్టర్ వంశీ. ఇక డైరెక్టర్ వంశీ అంటే మనకు ముందు సితార, లేడీస్ టైలర్, అన్వేషణ ఈ సినిమాలే గుర్తొస్తాయి. కానీ లేడీస్ టైలర్ కంటే ముందే వంశీ చిరు తో కూడా ఒక సినిమా చేసిన సంగతి చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. అసలు సంగతేంటంటే లేడీస్ టైలర్ కంటే ముందే చిరు తో మంచు పల్లకి సినిమా చేసాడు. ఇక ఈ సినిమాపై వంశీ ఒక ఇంటర్వ్యూ లో చెపుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు. నిజానికి అది తమిళ్ సినిమాను. దాన్ని తెలుగులో…
'ఆచార్య' షూటింగ్ లో అప్పుడే
కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా.. 'ఆచార్య' చిత్రయూనిట్ నవంబర్ 10 నుండి మళ్లీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిజానికి చిరు కూడా ఈ షూటింగ్ లో పాల్గొనాలి కానీ చిరు కరోనా పాజిటివ్ అని ముందు రావడంతో మిగిలిన చిత్ర బృందం షూటింగ్ ను ప్రారంభించింది. అయితే ఆ తర్వాత మళ్లీ టెస్టింగ్ కిట్ లో లోపం ఉండటం వల్ల పాజిటివ్ వచ్చిందని.. కరోనా లేదని తెలిసిపోయింది. దీనితో నవంబర్ 20 వ తేదీ నుండి చిరంజీవి కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

దీపావళి సెల్ఫీ
ప్రజల జీవితాలలో వెలుగులు నింపే దీపావళి పండగను దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ఘనంగా జరుపుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి, తన తనయుడు రామ్ చరణ్ తో పాటు కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను వైభవంగా జరుపుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. "ఆచార్య "మూవీ లో చిరంజీవి ,రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకొని అభిమానులను అలరించనున్నారు.
మెగా అభిమానులకు శుభవార్త
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా "అచార్య "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. కరోనా కారణంగా నిలిచిపోయిన "ఆచార్య " మూవీ షూటింగ్ సుమారు 8 నెలల తరువాత పునః ప్రారంభం అయ్యింది. చిత్ర యూనిట్ అంతా కరోనా టెస్ట్స్ చేయించుకున్న నేపథ్యం లో చిరంజీవి తనకు కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
చిరంజీవి కోలుకోవాలని లారెన్స్ స్పెషల్ పూజ
మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. చిరునే స్వయంగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. ఇక ఇదిలా ఉండగా చిరుకి కరోనా అని తెలిసిన వెంటనే అభిమానులు.. సినిమా సెలబ్రిటీస్ పెద్ద ఎత్తున స్పందించి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇక చిరుకు ఎంతో మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారిలో రాఘవ లారెన్స్ కూడా ఒకడన్న సంగతి తెలిసిందే. ఇక లారెన్స్ కూడా చిరుకు కరోనా పాజిటివ్ అని తెలిసి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అంతేకాదు చిరు కోసం స్పెషల్ గా తనకి ఎంతో ఇష్టమైన రాఘవేంద్ర స్వామికి పూజలు కూడా…
'చిరు' లేకుండానే 'ఆచార్య' షూటింగ్
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ఇక ఇన్ని నెలలు కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయింది. నిజానికి ఈ సినిమా షూట్ ను నిన్ననే ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఆశ్చర్యంగా నిన్ననే చిరు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి షాకిచ్చాడు.
అన్నయ్య త్వరగా కోలుకోవాలి
మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పిన సంగతి తెలిసిందే కదా. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ఆచార్య షూటింగ్ కోసం చెకప్ చేసుకోగా పాజిటివ్ వచ్చిందని చెప్పడంతో షాక్ అయ్యారు అందరూ. ఇక విషయం తెలిసిన వెంటనే సినీ సెలబ్రిటీస్ దగ్గనుండి అభిమానులు, సన్నిహితులు అందరూ చిరు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం చిరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
మెగాస్టార్ త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీల ట్వీట్స్
తనకు ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కరోనా పాజిటివ్ వచ్చిందని మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. `ఆచార్య` సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. 'ఆచార్య' షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాన`ని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక దీనితో…
మెగాస్టార్ కు కరోనా పాజిటివ్
టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమందికి కాస్త లక్షణాలు ఉండి టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వచ్చిన వాళ్లు ఉంటే.. అసలు మాకు ఏ లక్షణాలు లేవు అయినా పాజిటివ్ వచ్చిందని చెప్పిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోకు కూడా ఇదే జరిగింది. ఆ అగ్ర హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు చిరుకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
'ఆచార్య' కూడా రెడీ అవుతున్నాడు
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు ఇప్పటికే షూటింగ్ లు మొదలు పెట్టారు. కొంతమంది మిగిలిఉన్న షూటింగ్ భాగాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఇక అగ్ర హీరోల్లో నాగార్జున అయితే ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టారు . అది కూడా ఇక్కడ కాదు మనాలిలో ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూట్ లో వున్నారు. ఇక ఇప్పుడు చిరు కూడా సెట్స్ పైకి రావడానికి సిద్ధమవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కనుక లేకపోతే దసరా, దీపావళి సీజన్ లోనే విడుదలై ఉండేది.

మనవరాళ్ల సాయంతో చిరు వంట
లాక్ డౌన్ లో చిరు ఇంట్లో ఉంటూ బాగానే కాలక్షేపం చేస్తున్నారు. ఇక లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు తన పోస్ట్‌లతో నెటిజన్స్‌కి కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. పలు ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు వంటలు కూడా చేస్తున్నారు. గతంలో తన తల్లికి దోశలు.. చేపల వేపుడు చేసి పెట్టిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలను అభిమానులతో కూడా పంచుకున్నాడు. ఇక ఇప్పుడు మరో వంటకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసాడు. అయితే ఈసారి చిరు కాదు తన మనవరాళ్లతో కలిసి వంట చేయించాడు.
చిరంజీవి రెడీ ఫర్ షూటింగ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా ప్రముఖ యాంకర్ అనసూయ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.
మెగా స్టార్ చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ ?
మలయాళ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ "గీతాంజలి "మలయాళ మూవీ తో హీరోయిన్ గా మారారు. "ఇదు ఎన్న మాయం "మూవీ తో కోలీవుడ్ , "నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు కీర్తి పరిచయం అయ్యారు. పలు తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. "మహానటి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.