
ట్యాగ్ · 12 కథనాలు


ఫ్యాన్స్ కు సూపర్ స్టార్ రిక్వెస్ట్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అమితాబ్, నాగ్
మరో ఘట్టంలోకి 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సంజయ్ దత్
'గ్రీన్ ఛాలెంజ్' పూర్తి చేసిన రకుల్, నభా
రామరాజు ఛాలెంజ్ పూర్తి చేసిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
ప్రభాస్ ఛాలెంజ్ పూర్తిచేసిన శ్రద్దా

బాహుబలి ఛాలెంజ్ పూర్తి చేసిన రానా
మహేష్ ఛాలెంజ్ పూర్తి చేసిన శ్రుతీహాసన్

1,080 ఎకరాల ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న నాగార్జున..!
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పటికే విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్ని ఎన్నో మొక్కలను నాటారు. ఇక దీనిలో భాగంగానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాజిపల్లిలో 1,650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే కదా. తన తండ్రి పేరిట ప్రభాస్ దానిని అభివృద్ధి చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో అగ్రహీరో కూడా ముందుకొచ్చారు. ఆ అగ్రహీరో ఎవరో కాదు కింగ్ నాగార్జున.

ఫ్యాన్స్ కు సూపర్ స్టార్ రిక్వెస్ట్
కరోనా వల్ల హీరోలు తమ బర్త్ డే లను సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజును వేడుకలను జరిపే అవకాశం లేకుండా పోయింది. లేకపోతే ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇక మరో మూడు రోజుల్లో మహేష్ బాబు బర్త్డే వస్తున్న సంగతి తెలిసిందే కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి ఆనందపడాల్సిందే కానీ బహిరంగ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి. ఇక తన పుట్టిన రోజుకు మహేష్ ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. అదేంటంటే..తన బర్త్ డే సందర్భంగా తన అభిమానులను మొక్కలు నాటాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అమితాబ్, నాగ్
రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించగా ఇప్పటివరకూ ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము మొక్కలు నాటడంతో పాటు మరికొందరిని నామినేట్ చేస్తూ.. వారు కూడా మొక్కలు నాటేలా చేస్తూ..అందరూ కలిసి విజయవంతంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళుతున్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సాహసాలకు మారు పేరు కృష్ణ. ప్రయోగాత్మక సినిమాలు తీయాలంటే ఆయన తరువాతే. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రాజ్యమేలుతున్న వేళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ తనదైన మార్గం నిర్దేశించుకున్నారు. ఒకరు జానపదం మరొకరు పౌరాణికాలకు పెట్టింది పేరుగా ముందుకు సాగుతున్న వేళ.. సాంఘిక చిత్రాలకు కేరాఫ్ గా మారారు కృష్ణ. అందులోనూ విత్ యాక్షన్ అంటే.. నిర్మాతలు దర్శకులకు ప్రముఖంగా సూపర్ స్టార్ కనిపించేవారు. తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి…
మరో ఘట్టంలోకి 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'
ఏ ముహూర్తాన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించారో తెలియదు కానీ..ఈఛాలెంజ్ మాత్రం విజయవంతంగా కొనసాగుతోంది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాము మొక్కలు నాటడంతో పాటు మరికొందరిని నామినేట్ చేస్తూ.. వారు కూడా మొక్కలు నాటేలా చేస్తూ..అందరూ కలిసి విజయవంతంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళుతున్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సంజయ్ దత్
టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. నిజానికి ఈ కార్యక్రమానికి చాలా మంచి రెస్పాన్సే వస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ పాల్గొని తమ వంతుగా మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా పాల్గొన్నాడు.
గ్రీన్ ఛాలెంజ్ పూర్తి - యంగ్ హీరోయిన్స్ కు ఛాలెంజ్
గ్రీన్ ఛాలెంజ్ ఇప్పటివరకూ ఎంతో మంది సినీ సెలెబ్రిటీస్ పాల్గొని మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు మరో హీరో నిఖిల్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. రాజా రవీంద్ర విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నిఖిల్ తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని అవతార్ నివాస గృహా సముదాయంలో మొక్కలు నాటారు.
'గ్రీన్ ఛాలెంజ్' పూర్తి చేసిన రకుల్, నభా
గ్రీన్ ఛాలెంజ్.. ఈ ఛాలెంజ్ లో ఇప్పటివరకూ ఎంతో మంది సినీ సెలెబ్రిటీస్ పాల్గొని మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ రకుల్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఛాలెంజ్ ను పూర్తి చేసింది. హీరో నాగచైతన్య విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రకుల్ తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. `గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒకరిద్దరి కార్యక్రమం కాదు. మనందరం కలిసి చేయాల్సిన కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలి. ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టి ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతల`ని పేర్కొంది. తర్వాత ఈ…
రామరాజు ఛాలెంజ్ పూర్తి చేసిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులందరూ ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతున్నారు. అంతేకాదు తమ సన్నిహితులకు కూడా ఛాలెంజ్ ను విసురుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రామ్ చరణ్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మొక్కలు నాటాడు. అనంతరం అలియా భట్, దర్శకుడు రాజమౌళి, తన నూతన చిత్రం RRR సినిమా చిత్ర బృందం సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.
ప్రభాస్ ఛాలెంజ్ పూర్తిచేసిన శ్రద్దా
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ లో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ పాల్గొని పూర్తి చేశారు. కేవలం సినీ సెలబ్రిటీస్ మాత్రమే కాదు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసింది.

బాహుబలి ఛాలెంజ్ పూర్తి చేసిన రానా
ఇన్ని రోజులు పెళ్లి హడావుడిలో ఉన్న రానా నార్మల్ లైఫ్ లోకి వచ్చేసాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఫస్ట్ గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన ఛాలెంజ్ ను పూర్తి చేసి రానా కు కూడా ఛాలెంజ్ ను విసిరారు. శ్రుతీహాసన్ కూడా రానా ను నామినేట్ చేసింది. ఇక ఈ రోజు తన ఛాలెంజ్ ను పూర్తి చేసాడు రానా.
మహేష్ ఛాలెంజ్ పూర్తి చేసిన శ్రుతీహాసన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సినీ ప్రముఖులు భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. అంతేకాదు మన తెలుగులో స్టార్ట్ అయిన ఈ ఛాలెంజ్ చిన్న చిన్నగా పక్కన ఇండస్ట్రీకి కూడా వెళ్తుంది. తన పుట్టినరోజున గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్, శ్రుతీ హాసన్, ఎన్టీఆర్ కు ఛాలెంజ్ విసరగా ఇప్పటికే విజయ్ మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాడు. తాజాగా శ్రుతీహాసన్ కూడా మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించింది. తాజాగా చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటింది.