మరో ఘట్టంలోకి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’

Actor Ajay Devgan, Actor Ajay Devgan Green India Challenge, Ajay Devgan, Ajay Devgan accepts Green India Challenge, Ajay Devgan Green India Challenge, Ajay Devgan in RRR Movie, Bollywood, Bollywood Actor Ajay Devgan, Bollywood Super Star Ajay Devgan Upcoming Movies, Green India Challenge, Latest Update About Ajay Devgan, Telugu Filmnagar, Tollywood Updates, Tollywood Updates 2020

ఏ ముహూర్తాన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించారో తెలియదు కానీ..ఈఛాలెంజ్‌ మాత్రం విజయవంతంగా కొనసాగుతోంది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాము మొక్కలు నాటడంతో పాటు మరికొందరిని నామినేట్‌ చేస్తూ.. వారు కూడా మొక్కలు నాటేలా చేస్తూ..అందరూ కలిసి విజయవంతంగా ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా బాలీవుడ్ స్టార్‌ అజయ్‌ దేవ్‌గణ్‌ ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. సంతోష్‌ కుమార్‌తో కలిసి మొక్కలు నాటిన అజయ్‌ దేవ్‌గణ్‌.. అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు ఇచ్చారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నా మనసుకు చాలా దగ్గరైన కార్యక్రమం. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళుతూ.. కోట్లాది మొక్కలు నాటించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి నా శుభాకాంక్షలు. వారు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు అజయ్ దేవ్ గన్ తెలిపారు.

అంతేకాదు పర్యావరణ పరిరక్షణ కోసం పరితపించే తాను “NY” ఫౌండేషన్ స్థాపించానని… అయితే జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” దేశవ్యాప్తంగా విస్తృతంగా ముందుకు సాగుతుంది. ఇక నుంచి నా “NY” ఫౌండేషన్ కార్యక్రమాల్లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” భాగస్వామ్యం చేస్తాం. మేం నిర్వహించే ప్రతీ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.

కాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్న సంగతి తెలిసిందే

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − three =