టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. నిజానికి ఈ కార్యక్రమానికి చాలా మంచి రెస్పాన్సే వస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ పాల్గొని తమ వంతుగా మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా పాల్గొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు ఎంపీ సంతోష్ కుమార్ బర్త్ డే. ఈ సందర్భంగా సంజయ్ దత్, సంతోష్ కుమార్ ఇద్దరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి సంజయ్ దత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంజయ్ దత్ మాట్లాడుతూ మొక్కలు నాటడం, పెంచటం అందరి జీవన విధానం కావాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముంబైలోనూ చేస్తామని.. తమ అభిమానులు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.
ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం కె.జి.యఫ్ 2 షూటింగ్ లో ఉన్నాడు సంజయ్ దత్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. హైద్రాబాద్ లో క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: