
ట్యాగ్ · 16 కథనాలు


ఆకాశంలో ఒక తార.. షూటింగ్ షురూ

దుల్కర్ సల్మాన్ హీరోగా.. ఆకాశంలో ఒక తార

సీతారామం కు దాదా సాహెబ్ అవార్డ్

సీతారామం మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

ఆనాటి సీతారాముల ప్రేమ ఈనాటి సీతారామంలో

'హే సినామిక' ట్రైలర్ రిలీజ్

తెలుగు లో కూడా రిలీజ్ కానున్న 'హే సినామికా'

దుల్కర్ 'సెల్యూట్' రిలీజ్ డేట్ ఖరారు

దుల్కర్, హను ల మూవీ హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి

'కురుప్' ట్రైలర్ లో ఉంది ఒక్క శాతమే

దుల్కర్ సల్మాన్ 'కురుప్' ట్రైలర్ రిలీజ్

మరో సీత గా బాలీవుడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్

'లెఫ్టినెంట్ రామ్' బర్త్ డే గ్లింప్స్ రిలీజ్

దుల్కర్ 'లెఫ్టినెంట్ రామ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

దుల్కర్ సల్మాన్ 40వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా వున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ కాంత అలాగే తెలుగులో ఆకాశంలో ఒక తార సినిమాలు చేస్తున్నాడు.కాంతను తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.ప్రముఖ తెలుగు నటుడు రానా దగ్గుబాటి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఇక ఆకాశంలో ఒక తార పవన్ సాధినేని డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.ఇందులో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తుండగా రమ్య గుణ్ణం,సందీప్ గుణ్ణం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఆకాశంలో ఒక తార.. షూటింగ్ షురూ
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో 'మహానటి, సీతారామం, లక్కీభాస్కర్' చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ముఖ్యంగా గతేడాది ఆయన నటించిన ‘లక్కీభాస్కర్' మూవీ 100కోట్లు వసూలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ నేపథ్యంలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు దుల్కర్.

దుల్కర్ సల్మాన్ హీరోగా.. ఆకాశంలో ఒక తార
మలయాళ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్..తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరిచయం అక్కర్లేని పేరు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో తనదైన ముద్రవేశారీ అగ్ర కథానాయకుడు. తెలుగులోనూ మహానటి, సీతారామం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఈయన అలరించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా విడుదలైన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీలోనూ అతిథి పాత్రలోనూ దుల్కర్ అలరించారు.

సీతారామం కు దాదా సాహెబ్ అవార్డ్
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా సీతారామం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమాలో హను రాఘవపూడి కథ ముఖ్యంగా హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయి పోయారు. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ అందించి మేకర్స్ కు మంచి లాభాలు అందించింది.

సీతారామం మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు…

ఆనాటి సీతారాముల ప్రేమ ఈనాటి సీతారామంలో
పురాణాలు ఇతిహాసాలు తెలిసినవారికి సీతారాముల అనుబంధం గురించి.. ధర్మం కోసం రాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం నిలబడటం.. మరోవైపు సీత జీవితం భర్తతో పాటే అని రాముడితో సైతం అరణ్యవాసం చేయడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాముని గొప్పతనం, మంచితనం గురించి మనం ఎన్ని సార్లు చెప్పుకున్నా.. విన్నా తక్కువే. అంతేకాదు ఇప్పటికీ కూడా సీతారాముల అనుబంధం అనేది ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తారు. యుగాలు మారినా, టెక్నాలజీ పరంగా ఎంత పెరిగినా కొన్ని బంధాలు మాత్రం ఎప్పటికీ ఆదర్శప్రాయమే. ఇక సీతారాముల కళ్యాణం దగ్గర నుండి సీతను రావణుడిని అపహరించినా.. రాముడు రావణాసుర వధ చేసి సీతకు తీసుకొచ్చినా అన్నీ పురాణాల్లో…

'దుల్కర్' సినిమాలో 'రష్మిక'.. ఫస్ట్ లుక్ రిలీజ్..!
ఇండస్ట్రీలోకి రావడం ఒక ఎత్తైతే.. ఇండస్ట్రీలో రాణించడం మరో ఎత్తు. ఇండస్ట్రీలో స్టార్ రేంజ్ కు రావాలంటే అంత ఈజీ ఏం కాదు. అందులోనూ ఇప్పుడున్న పోటీ వాతావరణంలో ఇంకా కష్టం. కానీ అంతటి పోటీ వాతావరణంలోనూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొంతకాలానికే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం సౌత్ టూ నార్త్ వరకూ అన్ని భాషలను కవర్ చేస్తుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ప్రస్తుతం పీక్ కెరీర్ లో దూసుకుపోతుంది. గతఏడాది చివరిలో పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకోగా రీసెంట్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో…

'హే సినామిక' ట్రైలర్ రిలీజ్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి కేరళలోనే కాదు మహానటి సినిమా తరువాత ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే ఆయన చేసిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన ‘కురుప్’ సినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి వచ్చేస్తున్నారు. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హే సినామిక. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి పోస్టర్లు…

తెలుగు లో కూడా రిలీజ్ కానున్న 'హే సినామికా'
ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్-కాజల్ హీరో హీరోయిన్లు గా 'హే సినామికా' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు ఇక ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. గోపీ వసంత్ సంగీతం అందిస్తున్న ఈపాటను జనవరి 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈపాటను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. దీంతో ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నట్టు ఇన్…

దుల్కర్ 'సెల్యూట్' రిలీజ్ డేట్ ఖరారు
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో సెల్యూట్ సినిమా తెరకెక్కుతుంది. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో అరవింద్ కరుణాకరన్ గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతూనే మరోపక్క ప్రమోషన్స్ ను కూడా జోరుగా చేస్తుంది.

దుల్కర్, హను ల మూవీ హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తి
వైజయంతి మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వార్ అండ్ లవ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ప్రస్తుతం సెట్స్ మీదున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నారు.ఆసక్తికరమైన కథాకథనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటి మృణాళి ఠాకూర్ కథానాయిక. ఈ మూవీ కి "లెఫ్టినెంట్ రామ్" అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

'కురుప్' ట్రైలర్ లో ఉంది ఒక్క శాతమే
తమిళ్, మలయాళ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుండటంతో మేకర్స్ కూడా తమ సినిమాలను ఇక్కడ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా తన సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కురుప్. తెలుగులో కూడా ఈ నెల 12న విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. మరోవైపు తెలుగులో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

దుల్కర్ సల్మాన్ 'కురుప్' ట్రైలర్ రిలీజ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కురుప్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో సెకండ్ షో సినిమా రాగా.. ఇప్పుడు వస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈసినిమా నవంబర్ 12 న ప్రేక్షకులముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్.

మరో సీత గా బాలీవుడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్
సక్సె ఫుల్ "విట్టిదండు "మరాఠి మూవీ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ సూపర్ హిట్ "లవ్ సోనియా "మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "సూపర్ 30 ", "బాట్లా హౌస్ "మూవీస్ లో తన అభినయం తో మృణాల్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. మృణాల్ కథానాయికగా రూపొందిన "తూఫాన్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "జెర్సీ "మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన మృణాల్ "ఆంఖ్ మిచోలి " మూవీ లో నటిస్తున్నారు. మృణాల్ ఇప్పుడు టాలీవుడ్ కు కథానాయికగా ఎంట్రీ ఇస్తున్నారు.

'లెఫ్టినెంట్ రామ్' బర్త్ డే గ్లింప్స్ రిలీజ్
మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు 'మహానటి' నిర్మాతలతో కలసి హీరోగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. హనురాఘవపూడి దర్శకత్వంలో లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమకథను సినిమా రూపంలో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కాగా నేడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ వార్ నేపథ్యంలో హను రాఘవపూడి శైలిలో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తోంది. 1960స్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడినట్లు అర్థం అవుతోంది. ఇందులో దుల్కర్ లెఫ్టినెంట్…

దుల్కర్ 'లెఫ్టినెంట్ రామ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హనురాఘవపూడి దర్శకత్వంలో తెలుగులో మరో సినిమాలో నటిస్తున్నాడు. లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమకథను సినిమా రూపంలో తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈసినిమా రూపొందనుంది. పీరియాడికల్ లవ్‌స్టోరిగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కశ్మీర్‌లో మొదలైంది.