మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో ‘మహానటి, సీతారామం, లక్కీభాస్కర్’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ముఖ్యంగా గతేడాది ఆయన నటించిన ‘లక్కీభాస్కర్’ మూవీ 100కోట్లు వసూలు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ నేపథ్యంలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు దుల్కర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా గతంలో విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది.
ఈ క్రమంలో తాజాగా ఆకాశంలో ఒక తార సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. దర్శకుడు పవన్ సాదినేని, నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్‌లో దుల్కర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. కాగా ఈ చిత్రంలో కోలీవుడ్ భామ సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా తెలుగులో డెబ్యూ ఇస్తోంది.
సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానుంది. అయితే విడుదల తేదీపై టీమ్ క్లారిటీ ఇవాల్సి ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. లైట్ బాక్స్, స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























