ఆనాటి సీతారాముల ప్రేమ ఈనాటి సీతారామంలో

Sita Ramam Winning hearts everywhere,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Updates,Dulquer Salmaan,Mrunal Thakur,Rashmika,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sita Ramam,Sita Ramam Telugu Movie Latest News,Sita Ramam Movie Collection,Sita Ramam Box Office Collection,Sita Ramam Movie Review,Sita Ramam Movie Songs,Dulquer Salmaan Movies,Dulquer Salmaan New Movie,Sita Ramam Winning hearts

పురాణాలు ఇతిహాసాలు తెలిసినవారికి సీతారాముల అనుబంధం గురించి.. ధర్మం కోసం రాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం నిలబడటం.. మరోవైపు సీత జీవితం భర్తతో పాటే అని రాముడితో సైతం అరణ్యవాసం చేయడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాముని గొప్పతనం, మంచితనం గురించి మనం ఎన్ని సార్లు చెప్పుకున్నా.. విన్నా తక్కువే. అంతేకాదు ఇప్పటికీ కూడా సీతారాముల అనుబంధం అనేది ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తారు. యుగాలు మారినా, టెక్నాలజీ పరంగా ఎంత పెరిగినా కొన్ని బంధాలు మాత్రం ఎప్పటికీ ఆదర్శప్రాయమే. ఇక సీతారాముల కళ్యాణం దగ్గర నుండి సీతను రావణుడిని అపహరించినా.. రాముడు రావణాసుర వధ చేసి సీతకు తీసుకొచ్చినా అన్నీ పురాణాల్లో నిలిచిపోయే ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆనాటి సీతారాముల అనుబంధాన్ని నేటి సీతారామం సినిమాతో మరొకసారి కనెక్ట్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సీతారామం. టైటిల్ కు తగ్గట్టుగానే సీతారాముల మధ్య ఉన్న ప్రేమ వీరిద్దరిలో కనిపిస్తుంది. ఈ సినిమాకు ప్రాణం ఇందులోని పాత్రలు, వాటి చుట్టూ ఉన్న సంఘర్షణ. ఓ అనాథ అయిన రామ్ కు అంతులేని ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది.. అదే ప్రేమను దేశం కోసం త్యాగం చేస్తే ఎలా ఉంటుంది అనేది కీలకపాయింట్. తన జీవితంలోకి ఎవరో తెలియని సీత ఉత్తరాల రూపంలో వస్తుంది. సీత కోసం రామ్ ప్రయాణం.. రామ్ కోసం సీత ప్రయాణం ఈ సినిమాలో చూడొచ్చు. అలాంటి ప్రేమను చివరకు రామ్ త్యాగం చేయాల్సి వస్తే ఎలాంటి సంఘర్షణకు ఎదురవుతాడో చూపించారు. ఆనాడు రాముడు ధర్మం కోసం కట్టుబడి యుద్దం చేస్తే ఈనాటి రాముడు దేశం కోసం పోరాడిన వీర సైనికుడిగా నిలిచాడు.

ఇక ఈ సినిమా కథ తమ కోసమే పుట్టినట్టు చేశారు అటు దుల్కర్ సల్మాన్ కానీ ఇటు మృణాల్ ఠాకూర్ కానీ. దుల్కర్ సల్మాన్ లో ఉండే సెన్సిటివిటీ ఈసినిమాకు ప్రధాన బలం. లవ్, కామెడీ, ఎమోషనల్ ఇలా ప్రతి సన్నివేశంలోనూ తన బెస్ట్ ఇచ్చాడు. ఇక సీతగా కనిపించిన మృనాల్ ఠాకూర్‌కు ఇది గొప్ప అవకాశం. మొదటి సినిమాలోనే ఇంత బరువైన పాత్ర దొరికింది. సీతమహాలక్ష్మీ గా మృణాల్ ఠాకూర్ అభినయం ఈసినిమాకు మరో ఆకర్షణ. ఇక పొగరు ఉన్న వ్యక్తిగా ఆ తరువాత పరిస్థితుల పరంగా మార్పు చెందే పాత్రలో రష్మిక కూడా చాలా బాగా నటించింది. ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఈసినిమాలో పలు కీలక పాత్రల్లో నటించారు. ఎవరి పాత్రలకు వారు వంద శాతం న్యాయం చేశారు కాబట్టే ఈసినిమా ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది.

ఇలాంటి ప్రేమకథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి కథలు వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న విషయం మరోసారి నిరూపించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 5 =