
ట్యాగ్ · 18 కథనాలు


శేఖర్ కమ్ముల- ఏషియన్ సినిమాస్ కాంబోలో మరొకటి

ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం

'లవ్ స్టోరీ' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

మేకర్స్ తో ధనుష్ మీటింగ్
"లవ్ స్టోరీ " రిలీజ్ డేట్ ఫిక్స్
షూటింగ్ పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ సినిమా
"లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ ఈ రోజు పునః ప్రారంభం
శేఖర్ కమ్ములకు పితృవియోగం
ఆగస్ట్ లో "లవ్ స్టోరీ " బ్యాలెన్స్ షూటింగ్
కన్ఫామ్.. స్టార్ హీరోతో నెక్స్ట్ సినిమా
అగ్ర యువ కథానాయకుడితో శేఖర్ కమ్ముల చిత్రం
శేఖర్ కమ్ముల థ్రిల్లర్ మూవీ ?

కుబేర ఫస్ట్ గ్లింప్స్ అప్‌డేట్
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ కుబేర. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా వీరి మూడు పాత్రలను వేర్వేరు వీడియోలు, పోస్టర్ల ద్వారా పరిచయం చేశారు. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు-దర్శకుడు జిమ్ సర్భ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

సిద్ధాంతాలు, విలువలు పాటించి సినిమాలు తీస్తాను
నేషనల్అవార్డ్ విన్నర్ దర్శకుడు శేఖర్ కమ్ముల 2007 లో వచ్చిన సినిమా హ్యపీడేస్. ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. అంతా కొత్తవారితో తీసిన ఆ సినిమాను మరలా ఏప్రిల్ 19 న రి రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రంతో దర్శకుడు గా వెలుగులోకి వచ్చారు. ఆ తరవాత హ్యాపీ డేస్ నుంచి లవ్ స్టోరీ వరకు పలు సినిమాలు చేశారు. ఆయన సినిమా అంటే ఓ బ్రాండ్. మంచి విలువలతో సినిమాలు చేస్తున్న ఆయన దర్శకుడిగా 24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25 ఏట ప్రవేశించిన సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల పలు విషయాలను మీడియాతో సంభాషించారు.

ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లో శేఖర్ కమ్ముల మూడో సినిమా
టాలీవుడ్ లో ఉన్న సెన్సిటివ్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ప్రస్తుతం తను ధనుష్-నాగార్జున హీరోలుగా వస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించినా ధనుష్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం చాలా టైమ్ పట్టింది. రీసెంట్ గానే ఈసినిమా ను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

శేఖర్ కమ్ముల- ఏషియన్ సినిమాస్ కాంబోలో మరొకటి
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ,శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి(ఏషియన్ సినిమాస్ )బ్యానర్ లో మరో సినిమా చేయనున్నాడు.ఇంతకుముందు ఈ కాంబోలో లవ్ స్టోరీ వచ్చింది.నాగ చైతన్య ,సాయి పల్లవి జంటగా నటించిన ఈసినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది దాంతో శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రాన్ని కూడా ఏషియన్ సినిమాస్ బ్యానర్ లో చేసే ఛాన్స్ కొట్టేశాడు.అదే ఇప్పుడు ధనుష్ తో తీస్తున్న సినిమా.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఇందులో నాగార్జున కీలక పాత్రలో కనిపించనుండగా ధనుష్ కు జోడిగా రష్మిక నటిస్తుంది దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ధనుష్ శేఖర్ కమ్ముల మూవీ- ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్
నేడు తమిళ్ స్టార్ హీరో ధనుష్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తన సినిమాల నుండి అప్ డేట్లను ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే తను నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ సూపర రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా పీరియాడిక్ డ్రామాగా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.

ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం
సూపర్ స్టార్ ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్ని రోజులు ధనుస్ సార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. రీసెంట్ గానే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈసినిమా పనులు అయిపోవడంతో ధనుష్ ఇప్పుడు ధనుష్ సినిమాను స్టార్ట్ చేశాడు. ఇక ఈసినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సినిమా హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు…

'లవ్ స్టోరీ' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా 'లవ్ స్టోరీ'. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచగా దానికితోడు మహేష్ బాబు లాంటి హీరోలు సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అని చెప్పడంతో మరింత క్రేజ్ పెరిగింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా రేపు రిలీజ్ కానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం..

హీరో ధనుష్ , శేఖర్ కమ్ముల మూవీ కి స్క్రిప్ట్ రెడీ
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. బాలీవుడ్ లో రెండు మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ధనుష్ నటించిన "అత్రాంగి రే "మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో ధనుష్ ప్రస్తుతం "మారన్ "తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక తెలుగు మూవీ కి హీరో ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ తో ధనుష్ టాలీవుడ్ కు పరిచయం కానున్నారు.

మేకర్స్ తో ధనుష్ మీటింగ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఈసినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ధనుష్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనాగచైతన్యహీరోగా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద నారాయణదాస్ కె నారంగ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఇదే బ్యానర్ లో శేఖర్ కమ్ముల ధనుష్ తో సినిమా తీయనున్నారు. తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమా తెరకెక్కనుంది…
"లవ్ స్టోరీ " రిలీజ్ డేట్ ఫిక్స్
ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
షూటింగ్ పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ సినిమా
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. దీపావళికి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది అందరిలోనూ ఆసక్తిని పెంచిన లవ్ స్టోరీ యూనిట్ తాజాగా మరో అప్డేట్‌ను అందించారు.
సాంగ్ చిత్రీకరణలో "లవ్ స్టోరీ "
నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాగచైతన్య , సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పడం విశేషం. పవన్ CH సంగీతం అందిస్తున్నారు. "లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉండగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.
"లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ ఈ రోజు పునః ప్రారంభం
సోనాలీ నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పోసాని , రావు రమేష్ , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి పవన్ సి హెచ్ సంగీతం అందించారు. కొంత షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.
శేఖర్ కమ్ములకు పితృవియోగం
యాధృచ్చికమో లేక 2020 కు సినీ పరిశ్రమకు ఇచ్చిన శాపమో తెలియదు కానీ ఈ ఏడాది మాత్రం ఎంతో మంది సినీ నటీ నటులు.. కొంతమంది సెలబ్రిటీస్ కు మాతృ వియాగం.. కొంతమందికి పితృవియోగం చోటుచేసుకున్నాయి. తాజాగా మరో డైరెక్టర్ కు పితృ వియోగం కలిగింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య కమ్ముల మృతి చెందారు. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఈ ఉదయం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు శేఖర్ కమ్ములతో పాటు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నారు.
ఆగస్ట్ లో "లవ్ స్టోరీ " బ్యాలెన్స్ షూటింగ్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ డ్రామా "లవ్ స్టోరీ" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సిహెచ్ సంగీతం అందించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సినిమాస్ నారాయణ్ దాస్ నారంగ్ ఈ మూవీ తో నిర్మాణ రంగం లో అడుగుపెట్టడం విశేషం.
కన్ఫామ్.. స్టార్ హీరోతో నెక్స్ట్ సినిమా
టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల కాస్త డిఫరెంట్ అని చెప్పొచ్చు. పెద్ద ఫైట్లు, కమెర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకుండా.. మంచి ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో దిట్ట. 'డాలర్ డ్రీమ్స్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైనా.. 'ఆనంద్' సినిమాతో మంచి సక్సెస్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'హ్యాపీడేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, 'లీడర్'' వంటి విజయాలను అందుకున్న తర్వాత 'అనామిక' సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. గత ఏడాది విడుదలైన 'ఫిదా' చిత్రంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు శేఖర్.
అగ్ర యువ కథానాయకుడితో శేఖర్ కమ్ముల చిత్రం
ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘ఫిదా’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల.. త్వరలో ‘లవ్ స్టోరీ’తో పలకరించనున్నాడు. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా.. చిత్రీకరణ తుదిదశలో ఉంది.
శేఖర్ కమ్ముల థ్రిల్లర్ మూవీ ?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ వంటి ఫీల్ గుడ్ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. తెలంగాణ నేపథ్యం లో రూపొందిన "ఫిదా" మూవీ ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ రూపొందుతుంది.