శేఖర్ కమ్ములకు పితృవియోగం

Director Sekhar Kammula's Father Passes Away

యాధృచ్చికమో లేక 2020 కు సినీ పరిశ్రమకు ఇచ్చిన శాపమో తెలియదు కానీ ఈ ఏడాది మాత్రం ఎంతో మంది సినీ నటీ నటులు.. కొంతమంది సెలబ్రిటీస్ కు మాతృ వియాగం.. కొంతమందికి పితృవియోగం చోటుచేసుకున్నాయి. తాజాగా మరో డైరెక్టర్ కు పితృ వియోగం కలిగింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య కమ్ముల మృతి చెందారు. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఈ ఉదయం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు శేఖర్ కమ్ములతో పాటు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా “లవ్ స్టోరీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. ఇక ఈ సినిమాను మొదట ఏప్రిల్ లోనే విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మరి ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల-సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రేక్షకులు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో.. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో.. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.