శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సిహెచ్ సంగీతం అందించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సినిమాస్ నారాయణ్ దాస్ నారంగ్ ఈ మూవీ తో నిర్మాణ రంగం లో అడుగుపెట్టడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కరోనా లాక్ డౌన్ కారణంగా “లవ్ స్టోరీ” మూవీ షూటింగ్ నిలిచిపోయింది. బ్యాలెన్స్ షూటింగ్ ను ఆగస్ట్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీ లో జరపాలని దర్శకుడు శేఖర్ కమ్ముల ప్లాన్ చేశారు. హీరో నాగచైతన్య షూటింగ్ లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న “లవ్ స్టోరీ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























