
ట్యాగ్ · 134 కథనాలు · పేజీ 7


'మారి 2' సాయి పల్లవి కామెడీ సీన్
ధనుష్ 'డీ43' మొదలు

'VIP2' ధనుష్ కామెడీ సీన్
తలైవా రజనీకాంత్ బయోపిక్ మూవీ ?
ధనుష్, విజయ్‌కాంత్‌కు బాంబు బెదిరింపులు
కన్నడ సీమకు `అసురన్`

తమిళ హీరో ధనుష్ హిందీ మూవీ ప్రారంభం

#D40 తెలుగు టైటిల్ రిలీజ్

'లోకల్ బోయ్' రిలీజ్ డేట్ ఫిక్స్
#D 40 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

ధనుష్ కి జోడీగా నిత్యా మీనన్?

ధనుష్ 'కర్ణన్' టీజర్ రిలీజ్
సెల్వరాజ్ డైరెక్షన్‌లో ధనుష్ హీరోగా కర్ణన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ ను చూస్తుంటే ధనుష్ మరోసారి మరో డిఫరెంట్ మూవీతో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఓ పల్లెటూరు, అందులోని ప్రజలు, తమ జరిగే అన్యాయాలను ఎదరించేందుకు ఓ దైవం వస్తాడని భావింస్తుంటారు. వారిని కాపాడటానికి ధనుష్ గుర్రంపై రావడం.. ఓ డిఫరెంట్ ప్యాట్రన్‌లో సినిమా తెరకెక్కినట్లు 'కర్ణన్' టీజర్ చూస్తే…

'మారి 2' సాయి పల్లవి కామెడీ సీన్
ధనుష్ హీరోగా గతంలో వచ్చిన మారి అప్పట్లో ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సీక్వెల్ మారి 2 తో నాటీ డాన్ గా మరోసారి సందడి చేసాడు ధనుష్. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ధనుష్‌కు జోడీగా సాయి పల్లవి నటించగా ఇద్దరి జోడికి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే కామెడీ నవ్వు తెప్పిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ యూ ట్యూబ్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మరో నటి వరలక్ష్మి కూడా కీలకమైన పాత్రలో నటిస్తోంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని వండర్‌బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ స్వయంగా…

సెల్వ రాఘవన్ - ధనుష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆయిరాతిల్ ఒరువన్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ‘యూగానికి ఒక్కడు’ పేరుతో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు సెల్వ రాఘవన్. అంతేకాకుండా ఈ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా రావడానికి కొంత సమయం పడుతుంది.
ధనుష్ 'డీ43' మొదలు
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో పని చేస్తున్నాడు. ప్రస్తుతం ‘కర్ణన్’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. దానితో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘జగమే తంత్రం’ సినిమా కూడా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది.

"యుగానికి ఒక్కడు 2" మూవీ పోస్టర్ రిలీజ్
సూపర్ హిట్ "7/G బృందావన కాలని ", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే "మూవీస్ ఫేమ్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా డ్రీమ్ వ్యాలీ బ్యానర్ పై రూపొందిన "ఆయిరిత్తిల్ ఒరువన్ "(యుగానికి ఒక్కడు )తమిళ మూవీ 2010 సంవత్సరంలో రిలీజ్ అయ్యి విజయం సాధించింది. చోళ డైనాస్టీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ లో ప్రతీ సన్నివేశాన్నీ దర్శకుడు సెల్వ రాఘవన్ అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గ్రాఫిక్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.

'VIP2' ధనుష్ కామెడీ సీన్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ చేసిన రఘువరన్ బీటెక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ తర్వాత ఇదే సినిమాకు సీక్వెల్‌గా వీఐపీ సినిమాను తీశారు. సినిమాకు ధనుష్ స్వయంగా కథ, మాటలు సమకూర్చాడు. ఇక ఈ సినిమాలో కూడా అమలా పాల్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ హీరోయిన్ కాజల్ విలన్ పాత్రలో నటించింది. ఈమె విలనిజం సినిమాకు ఒక హైలైట్ అయితే అన్నింటికన్నా ముఖ్యంగా ధనుష్-అమలాపాల్‌ల జోడీ, ఆ ఇద్దరి మధ్య రొమాన్స్, సరదా ఫైటింగ్ సాగే సన్నివేశాలు ఈ సినిమాకు మరో హైలైట్. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ధనుష్ కామెడీ సీన్ మీకోసం.
తలైవా రజనీకాంత్ బయోపిక్ మూవీ ?
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా బయోపిక్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. లెజెండరీ ఫిల్మ్ స్టార్స్ నందమూరి తారక రామారావు , సావిత్రి బయోపిక్ మూవీస్ రూపొందాయి. లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ "తలైవి "మూవీ రూపొందుతుంది. ఇప్పుడు కోట్లాది ప్రజల అభిమాన కథానాయకుడు తలైవా రజనీకాంత్ పై బయోపిక్ మూవీ రూపొందనుందని సమాచారం.
ధనుష్, విజయ్‌కాంత్‌కు బాంబు బెదిరింపులు
ఈ మధ్య ఏంటో హీరోల ఇంటికి బాంబు బెదిరింపులు వెళ్తున్నాయి. ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్, ఇళయదళపతి విజయ్, అజిత్, సూర్య ఇంటిలో బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుస్, విజయ్ కాంత్ ఇండ్లలో బాంబులు పెట్టినట్టు పోలీస్ కంట్రోల్ రూంకు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకు రెండుసార్లు ఫోన్ చేసి చెన్నైలోని అభిరామపురంలో ఉన్న ధనుష్ ఇంటితోపాటు విరుగంబాక్కమ్‌లోని విజయ్ కాంత్ ఇంట్లో బాంబుల పెట్టినట్టు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన నటుల పోలీసులు నటుల ఇళ్ల వద్దకు చేరుకొని గాలింపులు జరిపారు. అక్కడ వారికి ఏమీ…
కన్నడ సీమకు `అసురన్`
నటుడిగా కోలీవుడ్ స్టార్ ధనుష్ ని మరో స్థాయికి తీసుకెళ్ళిన చిత్రం `అసురన్`(2019). యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ తమిళ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. అలాగే పలు పురస్కారాలను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా.. తెలుగులో `నారప్ప` పేరుతో రీమేక్ అవుతోంది. సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణ దశలో ఉంది.

తమిళ హీరో ధనుష్ హిందీ మూవీ ప్రారంభం
టి -సిరీస్ , కలర్ యెల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ధనుష్, అక్షయ్ కుమార్, సారా అలీఖాన్ ప్రధానపాత్రలలో "అత్రంగి రే " హిందీ మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయ్యింది. "అత్రంగి రే " మూవీ 2021 వ సంవత్సరం వేలంటైన్స్ డే (ఫిబ్రవరి 14 ) రిలీజ్ కానుంది.

#D40 తెలుగు టైటిల్ రిలీజ్
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగులో ఈ సినిమాకు 'జగమే తంత్రం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

'లోకల్ బోయ్' రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ టాలెంటెడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో తమిళ ప్రాచీన యుద్ధ విద్య ఆడిమురై నేపథ్యంగా తెరకెక్కిన సినిమా 'పటాస్'. ఆర్.ఎస్.సెంథిల్ దురైకుమార్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాలో స్నేహ, మెహ్రిన్ హీరోయిన్లుగా నటించగా.. నవీన్ చంద్ర విలన్ గా నటించాడు. ఈ సినిమాకు వివేక్-మర్విన్ సంగీతం అందించాడు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
#D 40 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా #D40 మూవీ రూపొందింది. ఐశ్వర్యా లక్ష్మి కథానాయిక కాగా యశ్వంత్ అశోక్ కుమార్, జోజు జార్జ్, హాలీవుడ్ మూవీ "గేమ్ ఆఫ్ త్రోన్స్" ఫేమ్ జేమ్స్ కాస్మో ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.

ధనుష్ కి జోడీగా నిత్యా మీనన్?
అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనే నటిస్తూ.. ముందుకు సాగుతోంది నిత్యా మీనన్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం వంటి దక్షిణాది భాషల్లోనే కాదు.. హిందీనాట కూడా నటిగా తనదైన ముద్రవేసింది ఈ అభినేత్రి. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటిగా పేరు తెచ్చుకున్న ఈ కేరళకుట్టి.. త్వరలో ఓ తమిళ చిత్రం కోసం ఇప్పటివరకు ధరించని ఓ విలక్షణ భూమికను పోషించబోతోందట.