సెల్వ రాఘవన్‌ – ధనుష్‌ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

selvaraghavan and dhanush new movie title and first look unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Dhanush,Dhanush Latest News,Dhanush New Movie News,Dhanush Upcoming Film Updates,Dhanush Latest Film Details,Dhanush Next Project News

తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆయిరాతిల్‌ ఒరువన్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ‘యూగానికి ఒక్కడు’ పేరుతో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించే పనిలో పడ్డాడు సెల్వ రాఘవన్‌. అంతేకాకుండా ఈ సినిమాలో ధనుష్‌ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా రావడానికి కొంత సమయం పడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. ఇక సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ‘నానే వరువేన్‌’ టైటిల్‌ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ప్రముఖ నిర్మాత కలైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. టైటిల్‌ పోస్టర్‌లో కూలింగ్‌ గ్లాస్‌ ధరించిన ధనుష్‌ వెనుక వేర్వేరు రకాల తుపాకులున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మిగిలిన నటీనటులు.. ఇతర విషయాల గురించి త్వరలోనే తెలియచేయనున్నారు.

ఇక ఇటీవలే ధనుష్ తన 43వ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + five =