
ట్యాగ్ · 33 కథనాలు · పేజీ 2


"#NBK107 " మూవీ సిరిసిల్ల షెడ్యూల్ పూర్తి

"లెజెండ్" @ 8 ఇయర్స్

బప్పి లహరి మరణం.. చిరు-బాలకృష్ణ సంతాపం..!

మల్టీ స్టారర్ మూవీస్ కు సిద్ధం -బాలకృష్ణ

విలన్ రోల్స్ చేయడానికి రెడీ..!

వరుస ప్రాజెక్ట్స్ తో బాలకృష్ణ

బాలయ్య- గోపీచంద్ మలినేని సినిమా ప్రారంభం

స్పీడుమీదున్న 'బాలయ్య'

సర్పైజ్ కోసం చూడమంటున్న బాలయ్య

మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ

రెండు ఛాయలున్న పాత్రలో బాలకృష్ణ?

#NBK 107.. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య..!
గత ఏడాది అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను కూడా ప్రారంభించేశాడు బాలకృష్ణ. క్రాక్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాను గోపీచంద్ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కోసం గోపీచంద్ పలు రీసెర్చ్ లు కూడా చేశాడు. ఇక ఈసినిమాలో కూడా బాలకృష్ణను రెండు పాత్రల్లో గోపీచంద్ చూపించనున్నట్టు ఇప్పటికే తెలిసిందే కదా.

"#NBK107 " మూవీ సిరిసిల్ల షెడ్యూల్ పూర్తి
బ్లాక్ బస్టర్ “అఖండ” మూవీ తరువాత బాలకృష్ణ హీరో గా “#NBK 107 “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

"లెజెండ్" @ 8 ఇయర్స్
బ్లాక్ బస్టర్ "సింహా " మూవీ తరువాత సక్సెస్ ఫుల్ బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “లెజెండ్ ” మూవీ 2014 మార్ఛి 28 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. ఒక కీలక పాత్రలో జగపతి బాబు నటించిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

బప్పి లహరి మరణం.. చిరు-బాలకృష్ణ సంతాపం..!
ఇటీవలే భారతరత్న, గాన కోకిల గా పేరు గాంచిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ను కోల్పోయాం. ఇక ఇప్పుడు మరో లెజెండరీ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహరి ని కోల్పోయింది చిత్ర పరిశ్రమ. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనని ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స తీసుకుంటున్న బప్పి లహిరి నిన్న రాత్రి మరణించారు. ఇక బప్పి లహరి మృతిపై బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ తో సహా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మల్టీ స్టారర్ మూవీస్ కు సిద్ధం -బాలకృష్ణ
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో బాలకృష్ణ తన పెర్ఫార్మెన్స్ , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "#NBK107 మూవీకి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలకృష్ణ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

విలన్ రోల్స్ చేయడానికి రెడీ..!
ప్రస్తుతం హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో విలన్ లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అప్పట్లో విలన్ అంటే ఇలానే ఉండాలి అన్న ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు..విలన్ లను చూపించడంలో కూడా మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. హీరోలకు తగ్గట్టే మంచి స్టైలిష్ విలన్స్ కూడా వస్తున్నారు. అందుకే విలన్ రోల్స్ చేయడానికి కూడా అందరూ ముందుకువస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో చాలా మంది హీరోలు విలన్ రోల్స్ చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు అంటేనే అర్థంచేసుకోవచ్చు విలన్ రోల్స్ కు కూడా ఎంత క్రేజ్ ఉంటుందో. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో అగ్రహీరో కూడా చేరిపోయారు. ఆహీరో ఎవరో కాదు బాలకృష్ణ.

బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో మీకు నచ్చిన మూవీ..?
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లు ఉంటాయి.. ఆ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులకు స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాంటి ఒక సాలిడ్ కాంబినేషనే బోయపాటి శ్రీను-బాలకృష్ణ ది. వీరిద్దరి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్. తన మొదటి సినిమా భద్ర లోనే తన మార్క్ ను చూపించాడు. ఆతరువాత వచ్చిన తులసి సినిమా కూడా అలాంటి జోనరే. మరి అలాంటి యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ లాంటి హీరో తోడైతే ఎలా ఉంటుంది. అలా వచ్చిన సినిమానే సింహా. ఈసినిమా రికార్డులు సృష్టించింది. దాంతో ఈకాంబినేషన్ అందరికీ నోటెడ్ అయిపోయింది. ఈ కాంబినేషన్‌లో…

వరుస ప్రాజెక్ట్స్ తో బాలకృష్ణ
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ"మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన "అఖండ " మూవీ పై భారీఅంచనాలు నెలకొన్నాయి. "అఖండ " మూవీ తరువాత హీరో బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారారు.

బాలయ్య- గోపీచంద్ మలినేని సినిమా ప్రారంభం
నటసింహా నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేనితో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటిది మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ సినిమా అంటే ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే గోపీచంద్ బాలకృష్ణ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసినట్టు తెలుస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు.

స్పీడుమీదున్న 'బాలయ్య'
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసపెట్టి సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు ఒక్క సినిమాలు చేస్తుంటే వీళ్లు మాత్రం ఒక్కోక్కరూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది.ఈసినిమాత తరువాత గోపిచంద్ మలినేని తో మరొక సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కథ, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడు గోపిచంద్ మలినేని. అఖండ అయిపోయిన వెంటనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

సర్పైజ్ కోసం చూడమంటున్న బాలయ్య
మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ లో అఖండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. దాాదాపు చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. ఈకరోనా లేకపోతే మరో రెండు రోజుల్లో రిలీజ్ అవ్వాలి. ఇక ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నాడు.

మాస్ పోలీస్ , ఫ్యాక్షనిస్ట్ గా బాలకృష్ణ
హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "అఖండ" మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ , టీజర్ లకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. "అఖండ "మూవీ తరువాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందే ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రెండు ఛాయలున్న పాత్రలో బాలకృష్ణ?
నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో `జై సింహా` తరువాత మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య సరసన శ్రియ నాయికగా నటించనున్నట్టు సమాచారం. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.