బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో బాలకృష్ణ తన పెర్ఫార్మెన్స్ , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “#NBK107 మూవీకి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలకృష్ణ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అఖండ” చిత్ర యూనిట్ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుంది. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. హీరో బాలకృష్ణ మాట్లాడుతూ .. “అఖండ” సినిమా ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందనీ , అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చామనీ , చాలా రోజుల తర్వాత ప్రేక్షకులందరూ కలిసి సకుటుంబసపరివార సమేతంగా థియేటర్లకు వస్తున్నారనీ , మన సనాతన ధర్మాన్ని తెలియజేసిన చిత్రం “అఖండ”అనీ , దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా మల్టీస్టారర్ చేస్తానని చెప్పారు . అనంతరం మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామిని “అఖండ” చిత్రయూనిట్ దర్శించుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: