విలన్ రోల్స్ చేయడానికి రెడీ..!

I Am Ready To Play Negative Shaded Roles Says Nandamuri Balakrishna,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Akhanda Telugu Movie Review,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Review,Akhanda Review,Nandamuri Balakrishna,Pragya Jaiswal,Boyapati Srinu,Thaman S,Akhanda Movie Updates,Akhanda Updates,Akhanda Movie Latest Updates,Akhanda Telugu Movie Updates,Akhanda Movie Live Updates,Akhanda Telugu Movie Latest News,Akhanda Movie Public Talk,Akhanda Movie Public Response,Akhanda Telugu Movie Live Updates,Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Akhanda Trailer Roar,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Pragya Jaiswal,Pragya Jaiswal Movies,BB3,Akhanda Live Updates,I Am Ready To Play Negative Shaded Roles Says Balakrishna,Nandamuri Balakrishna About Doing Villain Roles In Movies,Balakrishna About Doing Villain Roles In Movies,Balakrishna About Doing Negative Roles In Movies,Balakrishna About Doing Negative Roles,Balakrishna About Doing Villain Roles,Balakrishna New Movie Update,Balakrishna Latest Movie Update,Balakrishna Latest Film Updates,Balakrishna Upcoming Movies,Balakrishna Latest News,Balakrishna New Projects,Unstoppable New Episode,Unstoppable Latest Episode,Unstoppable,Unstoppable Promo,Unstoppable With Balayya,Unstoppable With Balakrishna,#NandamuriBalakrishna,#Akhanda

ప్రస్తుతం హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో విలన్ లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అప్పట్లో విలన్ అంటే ఇలానే ఉండాలి అన్న ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు..విలన్ లను చూపించడంలో కూడా మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. హీరోలకు తగ్గట్టే మంచి స్టైలిష్ విలన్స్ కూడా వస్తున్నారు. అందుకే విలన్ రోల్స్ చేయడానికి కూడా అందరూ ముందుకువస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో చాలా మంది హీరోలు విలన్ రోల్స్ చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు అంటేనే అర్థంచేసుకోవచ్చు విలన్ రోల్స్ కు కూడా ఎంత క్రేజ్ ఉంటుందో. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో అగ్రహీరో కూడా చేరిపోయారు. ఆహీరో ఎవరో కాదు బాలకృష్ణ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేస్తూనే ఈమధ్య హోస్ట్ గా కూడా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో వస్తున్న అన్ స్టాపబుల్ అనే షోకు బాలయ్య హోస్ట్ గా ఉన్నారు. ఇక తన ఎనర్జీతో షోను మరింత సందడిగా మారుస్తూ మంచి క్రేజ్ తీసుకొచ్చారు. అయితే రీసెంట్ గా అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోగా.. తాజాగా ఆ టీంను తన షోకు ఆహ్వానించారు. ఇక ఈసందర్భంగా టీమ్ తో పంచులు, కామెడీ టైమింగ్ తో ఉన్న ప్రోమో రిలీజ్ చేశారు. దీనిలో భాగంగా బాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా డైరక్టర్ దగ్గర కథ ఉండి అప్రొచ్ అయితే విలన్ పాత్రలు అయినా చేయడానికి తాను ఎప్పుడూ రెడీయేనని.. అయితే ఆ సినిమాలో హీరోగా కూడా తానే ఉండాలని క్లారిటీ ఇచ్చారు. మరి బాలకృష్ణ లాంటి హీరో అంత ఆఫర్ ఇచ్చారు.. చూద్దాం ఏదైనా డైరెక్టర్ బాలకృష్ణ కోసం అలాంటి కథను సిద్దం చేసి సినిమా తీస్తారేమో.

ఇక బాలకృష్ణ తన తరువాత సినిమా గోపీచంద్ మలినేనితో చేయనున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలుపెట్టనున్నాడు. ఇక గోపీచంద్ మలినేని కూడా బాలకృష్ణ కోసం ఒక సాలిడ్ కథను సిద్దం చేసినట్టు తెలుస్తుంది. అందులోనూ మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్లు తీయడంలో గోపీచంద్ దిట్ట. చూద్దాం గోపిచంద్-బాలయ్య కాంబినేషన్ లో కూడా హిట్ కొడతారేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seven =