కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Andhadhun Telugu Remake

ట్యాగ్ · 12 కథనాలు

Nithiin Andhadhun Telugu Remake Title and First Look Release Date Announced,Nithiin New Movie Title And First Look Will Be Revealed On Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood
ఫస్ట్ లుక్

నితిన్ 'అంధాధున్ రీమేక్' - టైటిల్, ఫస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్

మొత్తానికి నితిన్ మాత్రం చాలా స్పీడు మీదున్నాడు. ఈఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమా ఒకటి కాగా... రీసెంట్ గా రిలీజ్ అయిన రంగ్ దే సినిమా ఒకటి. రంగ్ దే సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక వెంటనే మరో సినిమాతో బిజీ అయిపోయాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అంధాధున్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

నితిన్ 'అంధాధున్ రీమేక్' రిలీజ్ డేట్ ఫిక్స్

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ మేర్ల‌పాక గాంధీ. ఆ తర్వాత వచ్చిన `కృష్ణార్జున యుద్ధం` ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు నితిన్ తో 'అంధాధున్ రీమేక్' చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్ కూడా ఇంకా ప్రకటించకముందే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జూన్ 11న చిత్రం విడుద‌ల కానుంద‌ని అధికారికంగా తెలియచేసారు.

TFN Adminవాట్సాప్
Actress Simran, Actress Simran To Play A Pivotal Role, Andhadhun Telugu Remake, Celebrities Latest Images, Simran, Simran Latest News, Simran New Movie News, Simran New Stills, Simran Next Project, Simran Next Project News, Simran To Play A Pivotal R
సినిమా వార్తలు

"అంధాధున్ " తమిళ రీమేక్ లో సిమ్రాన్ ?

వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ , పిక్స్ మేకర్ స్టూడియోస్ , పిక్చర్ మేకర్ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా , రాధికా ఆప్టే జంటగా , సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో రూపొందిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ "అంధాధున్ " హిందీ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరోయిన్ టబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

నితిన్ 'అంధాధున్' రీమేక్ షూటింగ్ మొదలు

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు యంగ్ హీరో నితిన్ మాములుగా లేదు. ఒక పక్క ఒక సినిమా చేస్తూనే మరోపక్క మరో సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసేసాడు. ప్రస్తుతం నితిన్ ‘రంగ్‌ దే’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కోసమే ఇటీవలే దుబాయ్ వెళ్ళింది చిత్ర బృందం. ఇక అక్కడే నితిన్ 30వ సినిమా కూడా మొదలుపెట్టాడు.

TFN Adminవాట్సాప్
Andhadhun Remake Upate: Team In Search Of Locations
సినిమా వార్తలు

లొకేషన్స్ వేటలో 'అంధాధున్' టీమ్

మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అంధాధున్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమాలో నటిస్తున్న లీడ్ యాక్ట్రెస్ ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ విషయాన్ని ఈ సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌ గా పనిచేస్తున్న సాహి సురేశ్‌ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రతీ సినిమాను ఛాలెంజ్ గా తీసుకొంటా -తమన్నా

15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ఫస్ట్ టైమ్ కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో తమన్నా "బోలే చూడియన్ " మూవీ లో నటిస్తున్నారు. "గుర్తుందా శీతాకాలం " మూవీ కి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ మూవీ "అంధాధున్"తెలుగు రీమేక్ మూవీ లో ఒక కీలక పాత్రకు తమన్నా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

టబు పాత్రకు తమన్నా బెస్ట్ ఛాయిస్

ఎన్నో వార్తలు.. ఎన్నో రూమర్స్ తర్వాత ఫైనల్లీ అందాదూన్ లో నటించే లీడ్ యాక్ట్రెస్ పై క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్. రాధికా ఆప్టే రోల్ లో ఏమో కానీ టబు పాత్రలో మాత్రం ఎవరు నటిస్తారో అన్నది మాత్రం అందరి క్యూరియాసిటీ. ఎందుకంటే పాత్రకున్న ప్రాముఖ్యత అలాంటిది. ఇక ఇన్ని రోజుల తర్వాత టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటించనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అఫీషియల్..అందాదూన్ రీమేక్ లో తమన్నా, నభా

మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అందాదూన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదనుకోండి. ఇక అందాదూన్ సినిమా చూసిన ఎవరికైన ఈ సినిమాలో టబు పాత్ర ఎంత కీలకమో తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పాత్రలో తెలుగులో ఎవరు నటిస్తారబ్బా అన్న దానిపై గతకొద్దిరోజులుగా పలువురి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల శ్రీయా పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు అంత ఇంపార్టెంట్ రోల్ లో ఎవరు నటిస్తున్నారో క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రేష్ఠ్‌ మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించారు. టబు స్థానంలో మిల్కీబ్యూటీ తమన్నా నటించనుండగా..రాధికా ఆప్టే స్థానంలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అవును టబు పాత్ర కోసం అడిగారు

ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన 'అందాదూన్' సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానాకు నేషనల్ అవార్డ్ దక్కింది. మరి ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషల్లో కి రీమేక్ చేయడం కామన్ థింగ్ కాబట్టి ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అందాదూన్ రీమేక్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అసలు తగ్గేదే లేదంటున్న 'శివగామి'...!

ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'అంధాదున్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా చేసిన ఆయుష్మాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రీమేక్ తెరకెక్కనుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎన్ నికిత రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ జూన్ నుండి మొదలుకానుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"అంధాధున్" రీమేక్ లో కీలక పాత్ర ?

యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన "భీష్మ" మూవీ ఘనవిజయం సాధించింది. "భీష్మ" మూవీ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న "రంగ్ దే" మూవీ రిలీజ్ కానుంది. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న నితిన్ తన స్వంత బ్యానర్ పై రూపొందనున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటించనున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News,Harish Shankar signs a Bollywood Remake, Harish Shankar to Direct Andhadhun Telugu Remake?, Andhadhun Telugu Remake, Andhadhun Telugu Remake Latest News, Andha
సినిమా వార్తలు

‘అంధాధున్’ రీమేక్ ని డైరెక్ట్ చేయనున్న హరీష్ శంకర్?

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధాధున్’. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా... మూడు జాతీయ పురస్కారాల(ఉత్తమ నటుడు, ఉత్తమ హిందీ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే)ను కూడా సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్‌ మీడియా, వయాకామ్‌ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్