శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధాధున్’. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా… మూడు జాతీయ పురస్కారాల(ఉత్తమ నటుడు, ఉత్తమ హిందీ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే)ను కూడా సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నితిన్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మీడియా, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు… ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ విషయమై హరీష్‌ని నిర్మాతలు సంప్రదించారని… ప్రస్తుతం వీరి మధ్య చర్చలు సాగుతున్నాయని టాక్. రానున్న రోజుల్లో ‘అంధాధున్’ రీమేక్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరి… హిందీ నాట ఘనవిజయం సాధించిన ‘అంధాధున్’ తెలుగులోనూ అదే బాట పడుతుందేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: