
ట్యాగ్ · 14 కథనాలు

అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ రికార్డ్

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
అల్లు అర్జున్ బాలీవుడ్ ప్లాన్స్
బన్నీ తగ్గేదేలే - మూడు కన్ఫామ్.. మూడు లైన్ లో

కోలీవుడ్ పై కన్నేసిన బన్నీ..?

బన్నీ కి జోడీ గా బాలీవుడ్ భామ..?
బన్నీ సరసన వరుణ్ హీరోయిన్?
త్వరలో బన్నీ టైటిల్ విడుదల

కాకినాడలో బన్నీ సందడి

బన్నీ, సుకుమార్ మూవీకి ముహూర్తం ఫిక్స్?

AA 19 మూవీ లో టబు ట్రెడిషినల్ లుక్
సంక్రాంతికి అల్లు అర్జున్ సినిమా కన్ఫామే
అల్లు అర్జున్ 'ఐకాన్' లో లీడింగ్ యాక్ట్రెస్..!

రాజస్థాన్ రణతంబోర్ నేషనల్ పార్క్‌లో అల్లు అర్జున్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ రికార్డ్
బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురము లో .. " మూవీ తో ప్రేక్షక, అభిమానులను అలరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన"పుష్ప :ది రైజ్"మూవీ దక్షిణాది , ఉత్తరాది లతో పాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ అన్ని భాషల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. "పుష్ప :ది రైజ్"మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ స్ట్రయిట్ హిందీ మూవీస్ ను క్రాస్ చేసి 100కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోవడం విశేషం.

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైలిష్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లు అర్జున్ టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరు పొందారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు , మలయాళ ప్రేక్షకులనే కాదు డబ్బింగ్ మూవీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. 2020 సంవత్సరం బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. "మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ మూవీ లో నటిస్తున్నారు.
అల్లు అర్జున్ బాలీవుడ్ ప్లాన్స్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ఆగస్ట్ 13 వ తేదీ, రెండవ భాగం 2022 సంవత్సరం లో రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.“పుష్ప “మూవీ తెలుగు భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.
బన్నీ తగ్గేదేలే - మూడు కన్ఫామ్.. మూడు లైన్ లో
సినిమాల రిలీజ్ ల సంగతి పక్కన పెడితే యంగ్ హీరోల నుండి స్టార్ హీరోలు వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక బన్నీ కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటి వరకూ స్టైలిష్ పాత్రల్లో నటించిన బన్నీ ఈ సినిమాలో అతడు డీ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. అంతేకాదు, చిత్తూరు యాసను కూడా మాట్లాడుతున్నాడు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈసినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్న సంగతి ఇందులో మొదటి భాగం దసరాకు గానీ సంక్రాంతికి గానీ విడుదల కాబోతుందని టాక్.

కోలీవుడ్ పై కన్నేసిన బన్నీ..?
దాదాపు ఏడాదికి పైన గ్యాప్ తర్వాత అల్లుఅర్జున్ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా జరుపుకుంటుంది. వీటితో పాటు సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

బన్నీ కి జోడీ గా బాలీవుడ్ భామ..?
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఇటీవలే 'అల వైకుంఠపురంలో' అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు చిత్ర యూనిట్. బన్నీ- అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కాబట్టి ఈ సినిమా పై కూడా ఉన్నాయి. ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు…
బన్నీ సరసన వరుణ్ హీరోయిన్?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ (2015) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ దిశా పఠాని. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో... తన గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేసింది ఈ పొడుగుకాళ్ల సుందరి. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ హాట్ బ్యూటీ... ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.
త్వరలో బన్నీ టైటిల్ విడుదల
స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ విషయం లో అప్ డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఆగష్ట్ 15వ తేదీన టైటిల్ ను రిలీజ్ చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మరి ఇదే రోజు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. చుద్దాం టైటిల్ ఒక్కటే రిలీజ్ చేస్తారో? లేక టైటిల్ ప్లస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారో?

కాకినాడలో బన్నీ సందడి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో... టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

బన్నీ, సుకుమార్ మూవీకి ముహూర్తం ఫిక్స్?
`ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని... హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ ప్రధానాంశంగా సాగే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. అంతేకాదు... ఇందులో కొత్త తరహా ప్రేమ కథను కూడా సుకుమార్ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్టు టాక్.

AA 19 మూవీ లో టబు ట్రెడిషినల్ లుక్
గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో AA 19 మూవీ శరవేగం గా రూపుదిద్దుకొంటుంది. పూజ హెగ్డే, నివేత పేతురాజ్ కథానాయికలు కాగా నవదీప్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. AA 19 మూవీ లో టబు పాల్గొంటున్న సందర్భంగా ఘన స్వాగతం పలుకుతూ చిత్ర యూనిట్ ట్వీట్ చేశారు. ట్రెడిషినల్ లుక్ లో టబు అందంగా ఉన్నారు.
సంక్రాంతికి అల్లు అర్జున్ సినిమా కన్ఫామే
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.
అల్లు అర్జున్ 'ఐకాన్' లో లీడింగ్ యాక్ట్రెస్..!
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా తరువాత మరో రెండు ప్రాజెక్టులు బన్నీ చేతులో ఉన్నాయి. వాటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కూడా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు 'ఐకాన్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ చివరి దశకు రాగానే ఈ సినిమాను ట్రాక్ లో పెట్టడానికి రెడీగా ఉన్నాడు వేణు శ్రీరామ్.