స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ విషయం లో అప్ డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఆగష్ట్ 15వ తేదీన టైటిల్ ను రిలీజ్ చేయనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మరి ఇదే రోజు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. చుద్దాం టైటిల్ ఒక్కటే రిలీజ్ చేస్తారో? లేక టైటిల్ ప్లస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారో?
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
[youtube_video videoid=W49QmLCHBFw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: