ట్యాగ్ · 17 కథనాలు
బన్నీ-త్రివిక్రమ్ నాలుగో సినిమా..!
బన్నీ చేతిలో మలయాళం హిట్ సినిమా హక్కులు
బన్నీ తో యానిమేషన్ సినిమా తీయాలి..!
నేను కోలుకుంటున్నా - అల్లు అర్జున్
"సరైనోడు" టీమ్ కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు

అల్లు అర్జున్ బర్త్ డే సీడీపీ రిలీజ్

ఈస్ట్ గోదావరి అడవుల్లో "పుష్ప "
థమన్ కు అల్లుఅర్జున్ అభినందనలు
ఈసారి టైటిల్ తోనే మొదలుపెట్టాడుగా బన్నీ..!

ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్
చిరు దివ్వెలతో అల్లు అర్జున్ కుటుంబం

అల్లు అర్జున్ భారీ విరాళం... కేరళకు కూడా
20 ఏళ్లు పూర్తి చేసుకున్న.. మీ ప్రేమ వల్లే
2003లో ' గంగోత్రి ' చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన నటుడు అల్లు అర్జున్. తండ్రి టాప్ ప్రొడ్యూసర్.. తాత అలనాటి ప్రముఖ కమెడియన్.. ఇంకా మేనమామ అగ్ర హీరో ఒకపక్క వారి ప్రోత్సాహం అందినా కూడా తన కష్టం తో.. పట్టుదలతో ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాడు. తన స్టయిల్ తో.. నటనతో.. డ్యాన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇన్నేళ్ల తన సినీ కెరీలో లో ఎన్నో విభిన్నమై సినిమాల్లో నటించాడు. పాత్ర ప్రాముఖ్యత చూస్తాడు కాబట్టే వేదం.. రుద్రమదేవి సినిమాల్లో నిడివి తక్కువైనా కూడా అంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆర్య, ఆర్య 2, హ్యాపీ, జులాయి,రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి…

సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
బ్లాక్ బస్టర్ “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ అధికం అయ్యింది. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అల్లు అర్జున్ , తన ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో 18. 5 మిలియన్ పైగా ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ దూసుకుపోతున్నారు.

అల్లు అర్జున్ చేతుల మీదుగా రకుల్ ప్రీత్ మ్యూజిక్ వీడియో రిలీజ్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన “డాక్టర్ జీ”, “థ్యాంక్ గాడ్” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ లో రకుల్ నటిస్తున్నారు.
బన్నీ-త్రివిక్రమ్ నాలుగో సినిమా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకూ మూడు సినిమాలు రాగా.. మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దీంతో వీరిద్దరిది బెస్ట్ కాంబినేషన్ గా నిలిచింది. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో సినిమా అయితే హిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాయో చూశాం. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా అంటే అభిమానులకు అది మంచి కిక్ ఇచ్చే న్యూసే అవుతుంది కదా. ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి చక్కర్లు కొడుతుంది. దానికి కారణం ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ట్వీటే కారణం…
బన్నీ చేతిలో మలయాళం హిట్ సినిమా హక్కులు
మన సినిమాలు బాలీవుడ్ లో ఇప్పటికే చాలా రీమేక్ అవుతున్నాయి. ఇక్కడ హిట్ అయిన ప్రతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు. ఇక మన మేకర్స్ మలయాళంలో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడానికి చూస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా మలయాళం సినిమాలు రీమేక్ చేసుకుంటున్నాయి. అయ్యప్పనుమ్ కోషియుమ్, లూసిఫర్, లవ్ మాక్ టైల్ ఇంకా చాలా సినిమాలే రీమేక్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ అయిన మరో సినిమా హక్కులు కూడా టాలీవుడ్ స్టార్ హీరో సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు అల్లు అర్జున్.
బన్నీ తో యానిమేషన్ సినిమా తీయాలి..!
ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో హీరోతో సినిమా చేయాలన్న ఆశ ఉంటుంది. అలానే హీరోలకు కూడా స్టార్ డైరెక్టర్ లతో చేయాలన్న కోరిక ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు.. ఎప్పటినుండో ఉన్న సంప్రదాయమే. ఇక ఇక్కడ ఒక డైరెక్టర్ కు యానిమేషన్ తరహా సినిమా చేయాలని.. అది కూడా ఓస్టార్ హీరోతో చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడట. ఇంతకీ ఆహీరో.. ఆ డైరెక్టర్ ఎవరంటే.. కామెడీ చిత్రాలకు కమర్షియల్ హంగులు అద్ది కొత్తరకం కామెడీని అందించిన డైరెక్టర్ మారుతి. మారుతికి ఎప్పటినుండో హాలీవుడ్ లోని అల్లావుద్దీన్ తరహా యానిమేషన్ సినిమా చేయాలని ఉందట... అదికూడా స్టార్ హీరో అల్లు అర్జున్ తో. నిజానికి అల్లు అర్జున్ కు యానిమేషన్ సినిమాలు అంటే చాలా కష్టం…
నేను కోలుకుంటున్నా - అల్లు అర్జున్
టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరుపొందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
"సరైనోడు" టీమ్ కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరైనోడు"మూవీ 2016 సంవత్సరం ఏప్రిల్ 22 వ తేదీ రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. రకుల్ ప్రీత్ సింగ్ , కేథరిన్ ట్రెసా కథానాయికలు. హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. శ్రీకాంత్ , ఆది పినిశెట్టి ముఖ్యపాత్రాలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫైట్స్ , డ్యాన్స్ లలో తనదైన మార్క్ తో అల్లు అర్జున్ ప్రేక్షకులను అలరించారు.

అల్లు అర్జున్ బర్త్ డే సీడీపీ రిలీజ్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ తన అద్భుతమైన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా అభిమాన గణం ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయిక. బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ తరువాత అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప "మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈస్ట్ గోదావరి అడవుల్లో "పుష్ప "
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా నిలిచిపోయిన "పుష్ప మూవీ షూటింగ్ ముందుగా కేరళ అడవుల్లో చిత్రీకరణకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది . కరోనా కారణంగా హైదరాబాద్ దగ్గరలోని వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరపాలనుకొన్న ప్లాన్ మార్చి ఈస్ట్ గోదావరి రంప చోడవరం , మారేడు మిల్లి అడవులలో చిత్రీకరణ జరపడానికి చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.
‘పుష్ప’లో కియారా అద్వానీ ప్రత్యేక గీతం ?
‘ఆర్య’, ‘ఆర్య2’ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఓ ప్రత్యేక గీతంలో మెరవనుందని సమాచారం.
థమన్ కు అల్లుఅర్జున్ అభినందనలు
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. థమన్ ఎస్ సమకూర్చిన సంగీతం తో ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థమన్ స్వరపచిన సాంగ్స్ కు విశేష స్పందన లభించింది.
ఈసారి టైటిల్ తోనే మొదలుపెట్టాడుగా బన్నీ..!
సుకుమార్ సినిమాతో కూడా అల్లు అర్జున్ అప్పుడే సోషల్ మీడియాలో రికార్డ్స్ ను క్రియేట్ చేయడం మొదలు పెట్టాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాతో పాటలు రూపంలో పలు రికార్డ్స్ క్రియేట్ చేసాడు బన్నీ. ఆ సినిమా హిట్ లో సగభాగం మ్యూజిక్ దే అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను నిన్న బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఇక పుష్ప అనే టైటిల్...బన్నీ లుక్ అందరికీ తెగ నచ్చేసింది. గుబురుగడ్డం, మెడకు నల్ల తాడు, డీ గ్లామర్ అండ్ రఫ్ లుక్‌లో అల్లు అర్జున్ ను ఎప్పుడూ చూడని విధంగా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. దీనితో…

ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్
బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా #AA 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లక్కీ హీరోయిన్ రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో #AA 20 మూవీ తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
చిరు దివ్వెలతో అల్లు అర్జున్ కుటుంబం
ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మనిషి మనుగడకే ముప్పు ఏర్పడింది. కరోనా కట్టడి కై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రణాళికలతో ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు కూడా ప్రభుత్వాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమ వంతు సాయం అందించి కృషి చేయవల్సిన అవసరం ఉంది.

అల్లు అర్జున్ భారీ విరాళం... కేరళకు కూడా
కరోనా ను అరికట్టేందుకు గానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇళ్లల్లో నుండి బయటకు రావొద్దని చెపుతూనే... ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. ఇంకా వేడి నీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు మన టాలీవుడ్ హీరోలు కూడా తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నితిన్త, పలువురు డైరెక్టర్స్ విరాళాలు ప్రకటించగా.... ఇప్పుడు వీరి ఖాతాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. తనవంతుగా మొత్తం రూ.1.25 కోట్ల సాయాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు.

మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్న బన్నీ ?
‘నా పేరు సూర్య’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ‘అలా వైకుంఠపురములో’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం... టాలెంటెడ్ డైరెక్టర్స్ సుకుమార్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తదుపరి చిత్రాలు చేయనున్నాడు బన్నీ. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. కాగా... ఒకవైపు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంటూనే... మరోవైపు ఓ పాన్ ఇండియా ఫిల్మ్‌ను, ఓ బైలింగ్వల్ మూవీనికూడా ప్లాన్ చేస్తున్నాడట బన్నీ. ఈ నేపథ్యంలో... పాన్ ఇండియా ఫిలిం కోసం బన్నీ ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ దర్శకులతో చర్చలు జరుపుతున్నాడని వార్తలు…