పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ తన అద్భుతమైన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్నారు. దేశవ్యాప్తంగా అభిమాన గణం ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయిక. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. ” మూవీ తరువాత అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s the CDP to celebrate Icon Staar @alluarjun‘s birthday on April 8th 😎#AlluArjunBirthdayCDP pic.twitter.com/g2LEGftS4w
— Mythri Movie Makers (@MythriOfficial) April 6, 2021
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8 వ తేదీ )సందర్భంగా హీరో , హీరోయిన్స్ , దర్శకులు , నిర్మాణ సంస్థలు అల్లు అర్జున్ బర్త్ డే సీడీపీ ని రిలీజ్ చేసి అడ్వాన్స్ గా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫోటో తో పాటు ఆయన నటించిన సినిమా పోస్టర్స్ తో రూపొందిన సీడీపీ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తమ అభిమాన హీరో అల్లు అర్జున్ బర్త్ డేను గ్రాండ్ గా జరపడానికి అభిమానులు ప్లాన్ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























