
ట్యాగ్ · 15 కథనాలు


మజిలీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

RRR అతిథి పాత్రలో అజయ్ దేవగన్?

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

`భీష్మ`కి ముహుర్తం కుదిరిందా?

విజయ్ చిత్రానికి టైటిల్ ఫిక్సయ్యిందా?

పోలీస్ అధికారి పాత్రలో పాయల్ రాజ్‌పుత్?

`ఆర్ ఆర్ ఆర్`... చరణ్ ఫస్ట్ లుక్ అప్పుడేనా?

ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్

యాత్ర రెండు రోజుల కలెక్షన్స్

అనుష్క లేటెస్ట్ లుక్స్ - అందరూ ఫిదా

మారిన ఏబీసీడీ రిలీజ్ డేట్
సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా “ఎబిసిడి” (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వర్మ
మొత్తానికి రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టే చేశాడుగా. లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడవుతుందంటే... ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ పై అది ఆధారపడి ఉంటుందని...మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే..ట్రైలర్ రిలీజ్ ప్రకటిస్తానని ఇటీవల తన ట్విట్టర్ లో ట్వీట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టే చేశాడు. ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22వ తేదీన రిలీజ్ కానున్నట్టు.. విద్యాబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె అధికారికంగా మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించింది.

మజిలీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
శివ నిర్వాణ దర్శకత్వంలో పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత భార్యాభర్తల్లాగ కనిపించనున్నారని.. వారిద్దరి మధ్య గొడవలెక్కువుంటాయని ఇప్పటికే నాగ చైతన్య చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ చిత్రంలో చైతు రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నట్టు సమాచారం. క్రికెటర్ గా కూడా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

కె.జి.యఫ్ ఏపీ, తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్
శాండిల్ వుడ్ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కె.జి.యఫ్’. కన్నడతో పాటు తెలగు, హిందీ భాషల్లో కూడా రిలీజై న ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి ఢోకా లేకుండా రాబట్టినట్టే కనిపిస్తోంది. మరి మంచి విజయం సాధించిన ఈ సినిమా ఏపీ, తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

విజయ బాపినీడుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మెగాస్టార్
ఇవాళ నాకెంతో దుర్దినం. విజయ బాపినీడు గారు మరణించారనేది నమ్మలేకుండా ఉంది. ఆయన నన్ను ఓ కొడుకులా, ఓ తమ్ముడిలా చూసుకునే వారు. ఆయనతో నా అనుబంధం కేవలం ఓ దర్శకుడు, నిర్మాతలా ఉండేది కాదు. నా మనసుకు అతి దగ్గరైన వ్యక్తి బాపినీడు గారు. వారితో నా పరిచయం 'పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమా నుండీ. అప్పట్నించి ఆరు సినిమాలకు పైగా ఆయన నాతో చేయడం జరిగింది. 'ఇతర హీరోలతో కూడా మీరు సినిమాలు చేయొచ్చు కదా' అని ఆయనతో అంటూ ఉండేవాడి. 'మీతో సినిమాలు తీయడం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్ గానీ, సెంటిమెంట్ గానీ మరొకరితో నాకు కుదురడం లేదు. వేరే వారితో చేయలేకపోతున్నాను' అని చెబుతూ చాలా కాలం నా పట్ల ఆ అభిమానాన్ని, ప్రేమను…

RRR అతిథి పాత్రలో అజయ్ దేవగన్?
రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రామ్ చరణ్ పై రాజమౌళి కొన్నికీలక సీన్లు తెరకెక్కిస్తుండగా... ఎన్టీఆర్ కూడా తన ట్రైనింగ్ ను స్టార్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి..

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత
ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు (గుత్తా బాపినీడు చౌదరి) ఈరోజు తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్ను మూశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్ధీవ దేహాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. రేపు హైదరాబాద్ మహా ప్రస్థానంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

`భీష్మ`కి ముహుర్తం కుదిరిందా?
యువ కథానాయకుడు నితిన్ కథానాయకుడిగా `ఛలో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `భీష్మ` పేరుతో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. కాగా... ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయని తెలిసింది. అంతేకాదు... ఆ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టే ఆలోచనలో యూనిట్ ఉందట. శరవేగంగా చిత్రీకరణ జరిపి... జూలైలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట.

విజయ్ చిత్రానికి టైటిల్ ఫిక్సయ్యిందా?
`తుపాకి`, `అదిరింది`, `సర్కార్` వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరువైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. ప్రస్తుతం... విజయ్ మరో భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని `రాజా రాణి`, `అదిరింది` ఫేమ్ అట్లీ రూపొందిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో... విజయ్ మహిళల ఫుట్ బాల్ కోచ్‌గా కనిపించనున్నాడు.

పోలీస్ అధికారి పాత్రలో పాయల్ రాజ్‌పుత్?
సెన్సేషనల్ హిట్ `ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు... తొలి చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయినా... సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది పాయల్. ప్రస్తుతం... మాస్ మహరాజ్ రవితేజకి జోడీగా `డిస్కోరాజా`లో నటిస్తున్న పాయల్... ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమాలోనూ నాయికగా నటిస్తోంది. అలాగే... కింగ్ నాగార్జున నటించనున్న `మన్మథుడు` సీక్వెల్‌లోనూ పాయల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

`ఆర్ ఆర్ ఆర్`... చరణ్ ఫస్ట్ లుక్ అప్పుడేనా?
గత ఏడాది పుట్టిన రోజు కానుకగా విడుదలైన `రంగస్థలం`తో కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాదు... నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి మెగాభిమానులనే కాదు సగటు ప్రేక్షకులకు అలరించాడు. అయితే... `రంగస్థలం` తరువాత వచ్చిన `వినయ విధేయ రామ` నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో... దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` (వర్కింగ్ టైటిల్)పై అందరి దృష్టి ఉంది. ఇందులో... యంగ్ టైగర్ యన్టీఆర్‌తో కలసి తొలిసారిగా కలసి నటిస్తున్నాడు చరణ్.

ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్
ఫైనల్లీ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. గత కొద్దికాలంగా ఈ సినిమా రిలీజ్ విషయంలో పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ ను తెరకెక్కించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఆ బయోపిక్ లో.. మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ చేశారు. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఎన్టీఆర్ కథానాయకుడు ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది. దీంతో ఆ ఎఫెక్ట్ ఎన్టీఆర్ మహానాయకుడుపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు…

సైరా మూవీ నుండి జగపతిబాబు ఫస్ట్ లుక్ రిలీజ్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు.

యాత్ర రెండు రోజుల కలెక్షన్స్
వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా యాత్ర. మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 8వ తేదీన విడుదలై హిట్ సాధించింది. దీంతో కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. కేవలం మూడు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రూ 5 కోట్ల షేర్ రాబట్టింది. మరి యాత్ర మూడు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

అనుష్క లేటెస్ట్ లుక్స్ - అందరూ ఫిదా
చక్కనమ్మ చిక్కినా అందమే అనే సామెత ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనుష్కకు బాగా సరిపోయేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే తన లేటెస్ట్ లుక్స్ చూస్తే అలానే అనిపిస్తోంది మరి. గత ఏడాది భాగమతి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అనుష్క ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుంది. భాగమతి తరువాత ఇప్పటివరకూ ఏ సినిమా రాలేదు తనది. ఇక ఇప్పుడు తాజాగా హేమంత్ మధకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ థ్రిల్లర్ మూవీలో నటించబోతుంది.