విజ‌య్ చిత్రానికి టైటిల్ ఫిక్స‌య్యిందా?

Interesting Title For Vijay New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Telugu Movies Updates,Vijay Thalapathy Next Movie Gets an Interesting Title,Hero Vijay New Movie Title,Hero Vijay Next Film Updates,Vijay Upcoming Movies News
Interesting Title For Vijay New Movie

`తుపాకి`, `అదిరింది`, `స‌ర్కార్‌` వంటి అనువాద చిత్రాల‌తో తెలుగువారికి చేరువైన‌ కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్‌. ప్ర‌స్తుతం… విజ‌య్ మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాని `రాజా రాణి`, `అదిరింది` ఫేమ్ అట్లీ రూపొందిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో… విజ‌య్ మ‌హిళల ఫుట్ బాల్ కోచ్‌గా క‌నిపించ‌నున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాకి `మైఖేల్‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు త‌మిళ‌నాట క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. తెలుగులోనూ అదే పేరుని టైటిల్ గా నిర్ణ‌యించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. మ‌న దేశంలో క్రీడా వ్య‌వ‌స్థ‌లోని లోపాలు, ప్ర‌తిభ ఉన్న క్రీడాకారుల‌కు జ‌రుగుతున్న అన్యాయం, బంధుప్రీతి… ఇత్యాది అంశాల‌ను స్పృశిస్తూ ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ని కోలీవుడ్ టాక్‌. దీపావ‌ళి కానుక‌గా రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి `డ‌బుల్ ఆస్కార్ అవార్డ్` విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=cIEPLv3BwDw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =