
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 59


సెన్సార్ పూర్తిచేసుకున్న కాంచన 3

తెలుగు నెటివిటీకి దగ్గరగా 'లూసీఫర్' డబ్బింగ్

'అవెంజర్స్ ఎండ్ గేమ్' ట్రైలర్ రిలీజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రలహరి

అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అప్ డేట్

'కబీర్ సింగ్' టీజర్ రిలీజ్

వర్మ 'కోబ్రా' ఫస్ట్ లుక్ రిలీజ్

అల్లు అర్జున్ #21 కి ఇంట్రెస్టింగ్ టైటిల్

విజయ్ సేతుపతి, శృతిహాసన్ జంటగా 'త్యాగం'?

బన్నీ, సుకుమార్ చిత్రంలో రష్మిక

షూటింగ్ పూర్తి చేసిన కాజల్
స్టైల్ 'ఐకాన్' అల్లు అర్జున్ కి హ్యాపీ బర్త్ డే

రజినీకాంత్ కి విలన్ గా సూర్య?

ఏడాదికో విజయంతో దూసుకుపోతున్న సమంత

అప్పుడు కమల్ హాసన్.. ఇప్పుడు రజినీకాంత్

నాగార్జున 'నేనున్నాను' కి 15 ఏళ్లు

తక్కువ గ్యాప్ లో రానున్న 'సీత', 'రాక్షసుడు'?

మజిలీ టార్గెట్ 22 కోట్లు.3 రోజుల్లో టోటల్ గా వచ్చింది ఇది!!
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత, దివ్యాంష కౌషిక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మజిలీ ఏప్రిల్ 5న రిలీజ్ మంచి హిట్ టాక్ తో దూసుపోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ ని రాబట్టుకుంటుంది. తొలి రెండు రోజుల్లో 13.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా.. మూడో రోజు కొద్దిగా డీలా పడినా... ఓవరాల్ గా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లోకేషన్స్ లో వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఏరియాల వారి సినిమా 3 రోజుల వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే.. నైజాం - 5.91 కోట్లు సీడెడ్ - 2.09కోట్లు యూఏ - 2కోట్లు ఈస్ట్: 0. 85 కోట్లు వెస్ట్ - 0.80 కోట్లు కృష్ణ - 1.04కోట్లు గూంటూరు…

సెన్సార్ పూర్తిచేసుకున్న కాంచన 3
2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు లారెన్స్. సూపర్ హిట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ముని సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాంచన 3. ఇప్పటికే మూవీ పోస్టర్స్ కు టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేషన్ ను పొందింది. తమిళం తోపాటు తెలుగులో ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు నెటివిటీకి దగ్గరగా 'లూసీఫర్' డబ్బింగ్
ఇద్దరు సినిమా తర్వాత మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆ తరువాత పెద్దగా తెలుగులో సినిమాలు రిలీజ్ చేయలేదు. దాదాపు చాలా ఏళ్ల తరువాత ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’ లాంటి సినిమాలతో వచ్చి మరోసారి తన సత్తా చూపించాడు. ఇక జనతా గ్యారెజ్ సినిమా తరువాత అయితే మోహన్ లాల్ క్రేజ్ తెలుగులో మరింత పెరిగిందని చెప్పొచ్చు. అందుకే ఆయన మలయాళంలో నటించిన సినిమాలన్నింటినీ తెలుగులో కూడా రిలీజ్ చేసి ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.

'అవెంజర్స్ ఎండ్ గేమ్' ట్రైలర్ రిలీజ్
అవెంజర్స్ సిరీస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సూపర్ హీరోస్ అందరు కలిసి నటిస్తున్న ఈ అవెంజర్స్ సీరీస్ లో ఎండ్ పార్ట్ గా వస్తున్న 'అవెంజర్స్ ఎండ్ గేమ్' సినిమా కోసం ఇండియన్ సిని ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమాకు స్పెషల్ గా ఏ.ఆర్.రెహమాన్ ఓ కొత్త పాటతో ముందుకొచ్చాడు. మార్వెల్ స్టూడియోతో కలిసి మార్వెల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకించి మార్వెల్ యాంతం తో ఓ పాటను కంపోజ్ చేసి రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రలహరి
కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'చిత్రలహరి'. ఏప్రిల్ 12వ తేదీన ఈసినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. ఈ సినిమాతో తేజ్ కు హిట్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాడు. ఇప్పుడు తాజాగా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది 'చిత్రలహరి'.

అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అప్ డేట్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాదే ఈ సినిమా గురించి వార్తలు వచ్చినా...ఈ ఏడాది ఈ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పినా డేట్ మాత్రం ఇంత వరకూ ఫిక్స్ చేయలేదు.

'కబీర్ సింగ్' టీజర్ రిలీజ్
సందీప్ వంగా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాను తమిళ్ లోనూ.. హిందీలోనూ రీమేక్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. తమిళ్ లో విక్రమ్ తనయుడు దృవ్ హీరోగా నటిస్తుండగా.. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.

వర్మ 'కోబ్రా' ఫస్ట్ లుక్ రిలీజ్
మొన్నటి వరకూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ... ఇప్పుడు కోబ్రా అంటూ మరో సంచలన సృష్టించడానికి వస్తున్నాడు. అయితే ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే.. ఇన్ని రోజులు ఒక డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా.. కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తూ.. పాటలు పాడటం ఇలా తనకు ఏది నచ్చితే అది చేసి పలు అవతారాలు ఎత్తిన వర్మ...ఇప్పుడు నటుడిగా మారి అందరికీ షాకిస్తున్నాడు.

అల్లు అర్జున్ #21 కి ఇంట్రెస్టింగ్ టైటిల్
నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత అల్లు అర్జున్ లాంగ్ గ్యాపే తీసుకున్నాడు. అయితే ఇంత గ్యాప్ తీసుకున్న బన్నీ ఈ ఏడాది మాత్రం వరుస సినిమాలతో వచ్చేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టిన బన్నీ ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా తన 21వ సినిమా టైటిల్ ను అధికారింగా ప్రకటించాడు.

మజిలీ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత, దివ్యాంష కౌషిక్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మజిలీ. ఈనెల 5వ తేదీన రిలీజై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో భార్య భర్తలుగా నటించిన నాగచైతన్య, సమంత జోడీకి.. వారిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక మంచి ఓపినింగ్స్ ని రాబట్టిన మజిలీ... నాగ చైతన్య కెరీర్ లో మొదటిరోజు సెకండ్ హైయ్యెస్ట్ గ్రాస్ గా నిలిచింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 7 కోట్లు కొల్లగొట్టింది మజిలీ. మరి పాజిటివ్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తో మజిలీ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం...

విజయ్ సేతుపతి, శృతిహాసన్ జంటగా 'త్యాగం'?
తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో కథానాయికగా తనదైన ముద్ర వేసింది శృతిహాసన్. ముఖ్యంగా తెలుగునాట ఈ టాలెంటెడ్ బ్యూటీ పలు విజయవంతమైన చిత్రాల్లో సందడి చేసింది. దాదాపుగా ఈతరం అగ్రకథానాయకుల అందరి సరసన మురిపించింది.

బన్నీ, సుకుమార్ చిత్రంలో రష్మిక
' ఆర్య', 'ఆర్య 2' చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

షూటింగ్ పూర్తి చేసిన కాజల్
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగులో కాజల్ నటించిన తాజా చిత్రం 'సీత' విడుదలకు సిద్ధంగా ఉండగా... తమిళంలో 'క్వీన్' రీమేక్ అయిన 'పారిస్ పారిస్' రిలీజ్ కి రెడీ అయ్యింది.
స్టైల్ 'ఐకాన్' అల్లు అర్జున్ కి హ్యాపీ బర్త్ డే
అల్లు అర్జున్... స్టైల్ అనే మాటకు ఓ 'ఐకాన్'లా నిలిచిన ఈతరం కథానాయకుడు.

రజినీకాంత్ కి విలన్ గా సూర్య?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రత్యేకం గా నిలిచిన చిత్రం 'ఖుషి'. సంచలన విజయం సాధించిన ఈ సినిమాకి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత పలు చిత్రాలను డైరెక్ట్ చేసిన సూర్య... మరోవైపు నటుడిగానూ తనదైన ముద్ర వేస్తున్నాడు.

ఏడాదికో విజయంతో దూసుకుపోతున్న సమంత
తెలుగునాట మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది సమంత. తొలి చిత్రం 'ఏ మాయ చేసావే' మొదలు తాజా చిత్రం 'మజిలీ' వరకు సమంత పట్టిందల్లా బంగారమే. ఈ తరంలో ఈ స్థాయి విజయాలు అందుకున్న కథానాయక మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు... ప్రతి ఏడాది ఈ టాలెంటెడ్ బ్యూటీ ఖాతాలో కనీసం ఒక విజయవంతమైన చిత్రం అయినా ఉండటం విశేషం.

అప్పుడు కమల్ హాసన్.. ఇప్పుడు రజినీకాంత్
' జెంటిల్ మన్', 'నిన్ను కోరి', 'జై లవకుశ', '118' వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది నివేదా థామస్. ప్రస్తుతం ఈ కేరళ కుట్టి 'శ్వాస', 'బ్రోచేవారెవరురా' వంటి తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.

నాగార్జున 'నేనున్నాను' కి 15 ఏళ్లు
కింగ్ నాగార్జున తో అధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు.. నాగ్, శివ ప్రసాద్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు మ్యూజికల్ హిట్స్ అనిపించుకున్నాయి. వాటిలో 2004లో వచ్చిన 'నేనున్నాను' ఒకటి.

ట్రయాంగిల్ హర్రర్ లవ్ స్టోరీ "ప్రేమకథాచిత్రమ్ 2"
ఇక టెక్నికల్ అంశాలకు వస్తే ఈ సినిమాకు రాంప్రసాద్ ఛాయాగ్రహణం ఒక పెద్ద ఎసెట్ట్ అని చెప్పాలి. దర్శకుడు అనుభవం లేని కొత్త వాడయినప్పటికీ ఆ అనుభవలేమి తెరమీద కనిపించకపోవడానికి ప్రధాన కారకుడు కెమెరామెన్ రాంప్రసాద్ అన్న విషయం స్పష్టంగా అవగతమవుతుంది. బాబీ సంగీతం బాగానే ఉంది. నూతన నిర్మాత సుదర్శన్ రెడ్డి మేకింగ్ స్టాండర్డ్స్ చాలా బాగున్నాయి. ఈ కథ డిమాండ్ చేసినంత మేరకు నిర్మాత బాగానే ఖర్చు చేసిన తాలూకు రిజల్ట్ తెరమీద కనిపించింది. అయితే హర్రర్ జోనర్ అన్నది బాగా బీటెన్ ట్రాక్ అయిపోయిన నేపథ్యంలో "ప్రేమకథాచిత్రమ్ 2" ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.

తక్కువ గ్యాప్ లో రానున్న 'సీత', 'రాక్షసుడు'?
జయాపజయాలతో సంబంధం లేకుండా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో 'సీత', 'రాక్షసుడు' చిత్రాలతో బిజీగా ఉన్నాడు.