ట్రయాంగిల్ హర్రర్ లవ్ స్టోరీ “ప్రేమకథాచిత్రమ్ 2”

#PremaKathaChitram2Review, 2019 Latest Telugu Movie News, 2019 Latest Telugu Movie Reviews, Prema Katha Chitram 2 Movie Live Updates, Prema Katha Chitram 2 Movie Public Talk, Prema Katha Chitram 2 Movie Review, Prema Katha Chitram 2 Movie Story, Prema Katha Chitram 2 Plus Points, Prema Katha Chitram 2 Public Response, Prema Katha Chitram 2 Review, Prema Katha Chitram 2 Review and Rating, Prema Katha Chitram 2 Telugu Movie Review, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

దెయ్యాలు, భూతాలు, ఆత్మలు ప్రేతాత్మలు- అనే కాన్సెప్టును ఎవరు ఎంతవరకు నమ్ముతారు అన్నది ఎప్పటికీ ఎడతెగని ఒక చర్చనీయాంశం. ఈ జోనర్ చిత్రాలను మూఢ నమ్మకాలను ప్రేరేపించే వ్యాపార ప్రయత్నాలుగా కొంతమంది విమర్శించినప్పటికి ” హర్రర్”అనే జోనర్ పెద్ద హిట్ ఫార్ములా అయినందున సంవత్సరానికి ఐదారు సినిమాలు ఈ జోనర్లో వస్తూనే ఉన్నాయి. అయితే ఒక జోనర్ లో ఒకటి అరా చిత్రాలు హిట్ అయితే వరుసగా బోర్ కొట్టే దాకా డజన్ల సంఖ్యలో ఆ జోనర్ చిత్రాలే రావడం గొర్రెల మంద సామెతను గుర్తుకు తెస్తుంది. అలాగని ఒక హిట్ ఫార్ములాను నెగ్లక్ట్ చేయలేరు. అందుకే ఎవరు ఏమనుకున్నప్పటికీ ఫార్ములాను ఫాలో అవటమే ట్రెండ్ కాబట్టి హారర్ జోనర్ సినిమాలు నిరంతరాయంగా వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఆ హర్రర్ కోవకు చెందిన మరో తాజా ప్రయత్నంగా” “ప్రేమకథాచిత్రమ్ -2″ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాలుగేళ్ల క్రితం వచ్చి ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం గా అద్భుత విజయాన్ని సాధించిన” ప్రేమకథాచిత్రమ్” కు ఇది సీక్వెల్ అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిజానికి టైటిల్ రిపిటీషన్ తప్ప ఆ కథకు ఈ కథకు ఏ మాత్రం సంబంధం లేదు.
ఈ నేపథ్యంలో ఈ తాజా “ప్రేమ కథ చిత్రమ్ 2″ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

సుధీర్( సుమంత్ అశ్విన్) ఒక అందమైన కాలేజీ కుర్రాడు. అతని అందం, చలాకీతనం చూసి చాలా మంది అమ్మాయిలు అతనికి ప్రపోజ్ చేస్తుంటారు. అలాగే బిందు( siddhi idnani) కూడా అతని ప్రేమలో పడి వన్ ఫైన్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ మంచి పార్టీ ఏర్పాటు చేసి అందరి సమక్షంలో సుధీర్ కు ఐ లవ్ యూ చెప్తుంది. కానీ తను అంతకు ముందే వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్పి బిందు ప్రేమను నిరాకరిస్తాడు. ఆ అవమానం భరించలేక అందరిముందే నీళ్లలోకి దూకేస్తుంది బిందు. ఆమెను రక్షించడం కోసం సుధీర్ కూడా దూకుతాడు.
కట్ చేస్తే ” కొన్ని నెలల తరువాత” అనే డిస్ప్లే తెరమీద కనిపిస్తుంది. ఆ తర్వాత కట్ చేస్తే సుధీర్ ప్రేమించిన నందు తనను ఎక్కడికైనా దూరంగా ఏకాంత ప్రదేశంలోకి తీసుకెళ్ళమని కోరుతుంది. ఆమె కోరిక మేరకు సుధీర్ నందును తీసుకుని ఊరు బయట ఒక గెస్ట్ హౌస్ కి వెళ్తాడు. ఆ గెస్ట్ హౌస్ లో సుధీర్ కు, అతని ఫ్రెండ్ బల్కంపేట బాలుకు ఎదురైన అనుభవాలేమిటి? తన వెంట వచ్చిన నందు ఎందుకు విచిత్రంగా బిహేవ్ చేస్తుంది? ఇక్కడ ఏదో దెయ్యం లాంటిది ఉంది… నన్ను రక్షించండి అని అరిచే నందు అంతలో తానే విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? ఒకవేళ నందుయే ఆత్మ అయితే నీళ్లలో దూకిన బిందు ఏమైంది? అసలు నందు- బిందు కాకుండా సుధీర్ జీవితంలో ఇంకెవరైనా ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది ప్రేమకథాచిత్రం టు క్లైమాక్స్.

ఈ కథను నూతన దర్శకుడు హరికిషన్ తెరకెక్కించిన విధానాన్ని విశ్లేషిస్తే టేకింగ్ పరంగా, టెక్నికల్ గా సినిమాను బాగానే డీల్ చేసినప్పటికీ రెండు గంటల సినిమాకు అవసరమైన మెటీరియల్ లేకపోవడంతో కొంత సాగతీత కనిపిస్తుంది. అయితే ఈ సాగతీత ప్రభావం ఎక్కువగా లేకుండా మధ్యమధ్యలో కొన్ని డైలాగ్ పంచ్ లు బాగా పేలటం కొంత రిలీఫ్ ఇస్తుంది. ముఖ్యంగా గెస్ట్ హౌస్ లోకి విద్యుల్లేఖ రామన్ ఎంట్రీ దగ్గర నుండి కొంత కామెడీ వర్క్ అవుట్ కావడం ఈ సినిమాను చాలా వరకు సేవ్ చేసింది. దీన్నిబట్టి దర్శకుడు హరికిషన్ లో కొన్ని సన్నివేశాలను బాగా డీల్ చేయటం, కొన్నింటిని తేలిగ్గా తీసుకోవడం వంటి మిక్స్డ్ ఎబిలిటీ కనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే కథలో ఉన్న బలహీనతే దర్శకుడి బలహీనతగా project అయింది తప్ప ఇన్ జనరల్ గా ఒక కొత్త దర్శకుడిలో ఉండవలసిన ఫిలిం హ్యాండ్లింగ్ ఎబిలిటీ విషయంలో హరికిషన్ ఓకే అనిపించాడు.

ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే- సినిమా అంతా తానేగా కనిపించిన నందు పాత్రధారిణి నందిత శ్వేత కు ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ దక్కాలి. సాఫ్ట్ అండ్ వైలెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో శ్వేత నటన పరంగా మంచి వైవిద్యాన్ని ప్రదర్శించింది. అలాగే బిందు పాత్ర పోషించిన సిద్ధి ఇద్నాని గ్లామర్ గా చలాకీగా అలరించింది. ఇక హీరో సుమంత్ అశ్విన్ విషయానికొస్తే- సినిమా అంతా తానే ఉన్నప్పటికీ అప్పియరెన్స్ తప్ప పర్ఫార్మెన్స్ పరంగా గొప్పగా చెప్పుకోదగిన సీన్స్ పడలేదు. ఒక హ్యాండ్సమ్ లవర్ బాయ్ గా మాత్రం బాగున్నాడు సుమంత్ అశ్విన్. హీరో ఫ్రెండ్ బల్కంపేట్ బాలు గా నటించిన టామ్ బాయ్ కొన్ని సందర్భాల్లో బాగా నవ్వించినప్పటికీ చాలాసార్లు బోర్ కొట్టించాడు. ఇక సినిమాలో కాస్తో కూస్తో రిలీఫ్ దొరికింది అంటే అది విద్యుల్లేఖ రామన్ చేసిన హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారానే అని చెప్పుకోవాలి.

ఇక టెక్నికల్ అంశాలకు వస్తే ఈ సినిమాకు రాంప్రసాద్ ఛాయాగ్రహణం ఒక పెద్ద ఎసెట్ట్ అని చెప్పాలి. దర్శకుడు అనుభవం లేని కొత్త వాడయినప్పటికీ ఆ అనుభవలేమి తెరమీద కనిపించకపోవడానికి ప్రధాన కారకుడు కెమెరామెన్ రాంప్రసాద్ అన్న విషయం స్పష్టంగా అవగతమవుతుంది. బాబీ సంగీతం బాగానే ఉంది. నూతన నిర్మాత సుదర్శన్ రెడ్డి మేకింగ్ స్టాండర్డ్స్ చాలా బాగున్నాయి. ఈ కథ డిమాండ్ చేసినంత మేరకు నిర్మాత బాగానే ఖర్చు చేసిన తాలూకు రిజల్ట్ తెరమీద కనిపించింది. అయితే హర్రర్ జోనర్ అన్నది బాగా బీటెన్ ట్రాక్ అయిపోయిన నేపథ్యంలో “ప్రేమకథాచిత్రమ్ 2” ఏ మేరకు విజయవంతం అవుతుందో చూడాలి.

ప్రేమకథాచిత్రమ్ 2 తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • ScreenPlay
  • Direction
  • Performance
4
Sending
User Review
0 (0 votes)

[subscribe]

[youtube_video videoid=7aDwgJGv1dw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 6 =