స్టైల్ ‘ఐకాన్’ అల్లు అర్జున్ కి హ్యాపీ బర్త్ డే

Telugu FilmNagar Wishes Allu Arjun A Very Happy Birthday,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Wishing a Very Happy Birthday To Stylish Star Allu Arjun,Allu Arjun Birthday Special News,Stylish Star Allu Arjun Birthday Celebration,Allu Arjun Latest Updates
Telugu FilmNagar Wishes Allu Arjun A Very Happy Birthday

అల్లు అర్జున్… స్టైల్ అనే మాటకు ఓ ‘ఐకాన్’లా నిలిచిన ఈతరం కథానాయకుడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాల నటుడిగా తొలి అడుగులు వేసి… ఆపై ‘డాడీ’ చిత్రంలో కథను కీలక మలుపు తిప్పే ఓ చిన్న పాత్రలో తన నర్తనం తో మెప్పించి… అటుపై కథానాయకుడిగా తొలి అడుగులు వేశాడు అల్లు అర్జున్.

హీరోగా చేసిన తొలి చిత్రమే బన్నీ కి వెరీ స్పెషల్ మూవీ. ఎందుకంటే… ఆ సినిమాతోనే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు 100 చిత్రాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఓ దర్శకుడి వందో సినిమా ద్వారా కథానాయకుడిగా తొలి అడుగులు వేసే అరుదైన అవకాశం అతి తక్కువ మందికే దక్కుతుంది. అలా హీరోగా తొలి చిత్రంతోనే ‘రేర్’ రికార్డును కైవసం చేసుకున్నాడు అల్లు అర్జున్.

హీరోగా చేసిన ఫస్ట్ ఫిలిం ‘గంగోత్రి’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించినా… రెండో చిత్రం ‘ఆర్య’ తోనే తనదైన ముద్ర వేసాడు బన్నీ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొదటి సినిమాని అప్పటికే 99 చిత్రాల అనుభవం ఉన్న దర్శకుడితో చేస్తే.. రెండో చిత్రాన్ని దర్శకుడిగా ఏమాత్రం అనుభవం లేని సుకుమార్ తో చేసి మెప్పించాడు బన్నీ. అంతేకాదు… సదరు సృజనాత్మక దర్శకుడి ఉజ్జ్వల భవిష్యత్తుకు పునాదిగా నిలిచాడు.

తొలి, మలి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ స్కోర్ చేసిన అల్లు అర్జున్… తన మూడో చిత్రం ‘బన్నీ’ తోను అదే బాటలో వెళ్లి ‘హ్యాట్రిక్’ హీరో అనిపించుకున్నాడు. అంతేకాదు… మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈతరం హీరోల్లో హ్యాట్రిక్ కొట్టిన తొలి కథానాయకుడు అనే రేర్ రికార్డును కైవసం చేసుకున్నాడు.

ఆ తర్వాత కాలంలో ‘దేశముదురు’, ‘పరుగు’, ‘జులాయి’, ‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సరైనోడు’… వంటి ఘనవిజయాలతో తారాపథంలో దూసుకుపోయాడు. అలాగే.. ‘వేదం’, ‘రుద్రమదేవి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాలలో ఫలితాలతో సంబంధం లేకుండా నటుడిగా మెప్పించాడు. చిత్ర చిత్ర ప్రవర్ధనమానంగా ఎదుగుతూ.. సినీ వినీలాకాశంలో తనదైన సంతకం చేసాడు బన్నీ.

‘ నా పేరు సూర్య’ తరువాత భారీ విరామమే తీసుకున్న అల్లు అర్జున్… ప్రస్తుతం 3ఆసక్తికరమైన చిత్రాలను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. తనకు కలిసొచ్చిన త్రివిక్రమ్, సుకుమార్ కాంబినేషన్లో పేరు నిర్ణయించని చిత్రాలతో పాటు… ‘ఎంసీఏ’ దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్లో ‘ఐకాన్’ పేరుతో రూపొందనున్న సినిమాలోనూ హీరోగా నటించబోతున్నాడు ఈ స్టైల్ ఐకాన్.

ఈ మూడు చిత్రాలతోనూ బన్నీ ఘన విజయాలను అందుకోవాలని… మున్ముందు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం. Happy Birthday to one and only ‘stylish star’ of tollywood, Allu Arjun.

[subscribe]

[youtube_video videoid=Qet0IxVPoe8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 17 =